రాచకొండ వారి సంతకం సోమవారం, జన 23 2017 

పది రోజుల కిందట వైజాగ్ జగదాంబ జంక్షన్ లో పాత పుస్తకాల దుకాణాలు తిరిగి కొన్ని పుస్తకాలు కొన్నాను. కొన్ని పాతవి, ఇప్పుడు ముద్రణలో లేని పుస్తకాలు దొరికాయని సంబరపడ్డాను, కానీ అంతకంటే ఆనందకరమైన విషయం మరొకటి ఇప్పుడే బయటపడింది. అదేంటంటే,

స్వయానా ఆయన స్వహస్తాలతో సంతకం చేసిన పుస్తకం. ఎవరో శ్రీ బి. రామాంజనేయులు గారికి 21.09.1977 న రచయిత ప్రసాదించిన పుస్తకం 🙂 ఇప్పుడు నా అద్రుష్టం.

img_9169

ప్రకటనలు

‘మళరే’ ప్రేమం… మంగళవారం, ఆగ 16 2016 

ఒక . (డాట్)

ఎంతో ఆశతో నేను, నా స్నేహితుడు ‘కడలి ‘ సినీమాకు వెళ్ళాం. అంతకు ముందే ‘నెంజకుళ్ళే’ అన్న తమిళ్ పాటని వినీ, వినీ వున్నామేమో, ఆ ‘గుంజుకున్నా ‘ తెలుగు ని విని, కసి తో బాదేసింది. మనం అయితేనా….. ఆ పాటని ఎలా వ్రాసేవాళ్ళం??? ప్చ్.ప్చ్.ప్చ్.. చ్చొచ్చొచ్చూ…

 

రెండో . (డాట్)

నా ఫ్రెండ్ కి ఫ్రెండ్, మళయాళం లో వచ్చిన ‘ప్రేమం’ అనే సినీమాని 17 సార్లు చూసాడట. ఆశ్చర్యావిస్తు పోయాను… అదేమన్నా ‘షోలే’ నా, లేక ‘ DDL’ ఆ అని…

 

మూడో . (డాట్)

‘ప్రేమం’ సినీమాని మలయాళం లో చూసాను. ‘మళరే’ పాట నచ్చింది. సినీమా కూడా నచ్చింది.

 

 

ఇంకో . (డాట్)

నా ఫ్రెండ్ ఒకాయన ఉన్నట్టుండి ఒక రోజు నా మీద ఒక తవిక లాంటి కవిత వ్రాసి, మిగతా మా అందరి ముందు చదివాడు. అందరం ఆశ్చర్యానందం పొందాం. అప్పట్నుంచీ ఆ కవితా బాణాల్ని ఆయనకి నచ్చిన వాళ్ళ మీద విచ్చలవిడి గా వదుల్తూనే వున్నాడు.

 

మరో . (డాట్)

తెలుగు లో ‘ప్రేమం’ సినీమాని రీమేక్ చేస్తున్నారని చదివాను. మన నేటివిటీ కి తగ్గట్టుగా తీయగలరా? కథ కంటే కూడా ద్రుశ్యం, సంగీతం ముఖ్యమైన సినీమా. సరిగ్గా వస్తుందో లేక మరో ‘ముంగారు మళె ‘ అవుతుందో అన్న ఒక చిన్న అనుమానం.

 

 

చివరి . (డాట్)

మంగళ వారం రోజు ఒక వార్త చదివాను, తెలుగు ‘ప్రేమం’ లోని ‘ఎవరే’ అనే పాట ని మరుసటి బుదవారం రిలీజ్ చేస్తారని. వెంటనే ఒక ఆలోచన…

 

. (డాట్) . (డాట్) . (డాట్) . (డాట్)

Dots

ఇక అన్ని డాట్ లని కలిపేసి ,

….వెంటనే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ‘మళరే’   పాటని తెలుగు లో వ్రాయ గలరా అని అడిగాను. అఫీషియల్ గా పాట రిలీజ్ కాకముందే వ్రాయాలీ అన్నది ఆలోచన. మూడ్రోజులు ఆలోచించి ఆయన వ్రాసింది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

ఇంతకు ముందు ఎన్నో సార్లు, పాటల లిరిక్స్ అర్థం కాక, మరికొన్ని నచ్చక, పల్లవుల్లో చరణాల్లో, మాకు నచ్చిన పదాలు పెట్టుకొని పాడుకున్న సందర్భాలున్నాయి.

అలా ఇప్పుడు ఒక పూర్తి పాట. అంతే…

బావుందా, బాలేదా అన్నదాంతో మాకు సంబందం లేదు. సరదాగా కాసేపు గడిపామా లేదా అన్నదే మాకు ముఖ్యం. 🙂

 

ఇక పోతే పాట ఇక్కడ….

అడిగే……

//పల్లవి//

తొలి ఉదయం రవి కిరణం నీ మీద వాలి ; నా కళ్ళలో చేరి కలలాగా మారె!

సుమగంధం నీ నుదుటిని సుతిమెత్తగ తాకి ; నా శ్వాసలో చేరి ప్రాణంగ మారె!

నా కోసం నీ రూపం సృష్టించెను కాలం ; మన కోసం వనమెల్లా విరబూసిన వైనం!

వనదేవత నువ్వే అని వర్షించిన మేఘం : ఆ వర్షంలో జనియించెను ప్రేమానురాగం!

అడిగే…… తనివే తీరగ మది అడిగె

అరెరే…….నా మనసే నీతో జత కలిసే

//చరణం//

నీ అందమె నాపై ఒక మాయ చేసె ; నీ రూపమె నాలో నిలువెల్ల కదిలె!

మనసే నన్నే బతిమాలసాగె ; నీతో చెలిమే కడదాక కోరె!

ఈ కాల మా కాల మే కాలమైనా ;

ఆ లోక మీ లోక మే లోకములో ఉన్నా నీ కోసమే కాద బ్రతికుంది ప్రాణం…..ఎచటుoటివో నా కలా………

కలలాగ వచ్చి నను కొత్తగా మార్చి ; నా జీవితానికి ఒక అర్థం తెలిపావే!

ఆ దేవుడి వరమై నా దేవత నువ్వై

అణువణువు ప్రతి అణువు నీ రుణమేలే………..అడిగే……..

నా కోసం నీ రూపం సృష్టించెను కాలం ; మన కోసం వనమెల్లా విరబూసిన వైనం!

వనదేవత నువ్వే అని వర్షించిన మేఘం : ఆ వర్షంలో జనియించెను ప్రేమానురాగం!

అడిగే……తనివే తీరగ మది అడిగె

అరెరే…….నా మనసే నీతో జత కలిసే

 

ఏమో గుర్రం ఎగరావచ్చు!!! శనివారం, అక్టో 17 2015 

అమ్మాయిగారూ… అమ్మాయిగారూ,

పొద్దుట్నుంచి బువ్వ తినలేదు కదండీ??

అమ్మాయిగారూ… మడిసికి మనేద మంచిది కాదండీ…     మనేద పెట్టుకొని ఏడిస్తే మన కన్నీళ్లే కరుసైపోతాయి, ఏదీ ఆ పాదం సూపండి…

అసలండీ… దేవుడు మనకు కనీళ్లిచ్చింది మనకోసం కాదంటంది, ఎదటోళ్ళకి  బాదోచ్చినప్పుడు మనం కన్నీళ్లు పెట్టాలట… అందుకు… అప్పుడు ఆళ్ళకి దైర్ణం వత్తాది…

నిజమండీ… దొర గారు సెప్పారు. మనకి కట్టవత్తే నవ్వాలటండీ, కాల్లో ముల్లు గుచ్చుకుందనుకోండి, ఏడవకూడదండీ, కంట్లో గుచ్చుకోలేదు గదాని నవ్వాలటండీ… హెహెహె…

ఒక్కథ చెప్పనాన్డి? అనగనగనగా ఓ రాజు గారు, ఆలు ఓడికి ఉరి సిచ్చేసినారు, ఆడు పకపకమని నవ్వాడంటండీ … దానికి రాజు గారు, ‘ఏరా, ఎంటా నవ్వు? ఇప్పుడే సంపేత్తాను’  అన్నారంటండీ. దానికి ఆడు, ‘ఓ రాజా, నాకు ‘రెక్కల గుర్రం’ విద్య తెలుసు, నన్ను గానీ రేపు సంపేశారనుకోండి, ఆ ఇద్య జూసే అదృష్టం మీకెక్కడిదిరా ఎర్రి మొహమా’ అన్నాడటండీ.

‘మరైతే  గుర్రాన్నెగిరించు’ అన్నారు రాజుగారు.

‘నిజంగా ఎగిరించాడా’???

‘ఆస గదే, ఆర్నెల్లు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండీ, దాణా, మందులు, మాకులూ కావాలి’ అన్నాడు.

రాజుగారు ‘సరే’ అన్నారు.

రోజూ ఆరంపించే పాలూ, మీగడా, ముప్పాతిక తను తిని, ఆ మిగిలినదాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది వాడికి. ఖైదు లో పక్కనున్నోడు ‘ఏరా, గుర్రం నిజంగా ఎగురుద్దా?’ అన్నాడు.

దానికి వీడు నవ్వేసి, ‘ఉత్తినే, కథ అల్లాను లే’ అన్నాడు.

‘మరైతే అబద్దం చెప్పి లాభమేముందిరా’ అన్నాడు.

‘హి హి హ హ , ఉరి సిచ్చ ఆరు నెల్లు వాయిదా పడింది కదా, ఈ లోగా ఎన్నో జరగొచ్చు,

రాజు గారు మనసు మార్చుకొని నా సిచ్చ రద్దు చేయొచ్చు, రాజు గారే సచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలి పోవచ్చు, సివారాఖరికి, ‘ఏమో, గుర్రం ఎగరావచ్చు’ అన్నాడు.

ఈ ముళ్లపూడి వారి మాటలు అవగానే, వేటూరి వారి పాట…

¯¯¯¯¯¯¯¯¯¯¯¯

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో…. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఆనాటి నీ తల్లి, ఆకాశ జాబిల్లి

తారలన్నీ నీకు తలంబ్రాలు పోసి,

హరివిల్లు దిగివచ్చి, హరి వంటి పతినిచ్చి వెళ్ళావచ్చు, రోజు మళ్ళా వచ్చు

ఆ మారు తల్లైన, తల్లల్లే తా మారి,

పట్టుచీరలు పెట్టి  పరమన్నాం వడ్డిస్తే,

ఆరారు కాలాల నీ కంటి నీలాలు ఆరా వచ్చు, మనసు తీరావచ్చు

దైవాలు పెట్టేను లగ్గాలు, పెళ్లిళ్ల లోగిళ్లు స్వర్గాలు,

ఆ నింగి, ఈ నేల, పాడాల నీ పాట ఈ పూటా,

పాములు పాలు ఇవ్వావచ్చు, బెబ్బులి పిల్లిగ మారా వచ్చు,

నవ్విన చేను పండా వచ్చు, రోకలి చిగురూ వెయ్యావచ్చు,

ఏమో…. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏడింట సూరీడు ఏలుతున్నాడు, రాకుమారుడు నీకు వ్రాసి వున్నాడు,

రతనాల కోటకే రాణి వంటాడు, పగడాల దీవికె దేవి వంటాడు,

గవ్వలు రవ్వలు కానూ వచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు,

రామచిలుక నువ్వు కానూ వచ్చు, రాంబంటు కలా పండావచ్చు,

ఏమో …. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో…

¯¯¯¯¯¯¯¯¯¯¯¯

ఇంకా ఏం కావాలి?

రోకలి చిగురూ వెయ్యావచ్చు… ఒక సామెత… ఆలోచిస్తే… మరణం లోంచి జీవితం…

ఇంతకంటే  గొప్ప ఆశావాదం ఎక్కడుంటుంది…

ముషాయిరా మంగళవారం, ఆగ 4 2015 

‘Celebrating the best of Urdu poetry’ selected by Khushwant Singh & Kamna Prasad చదివాను…

ఆరుబయట, చల్లని సాయంత్రం,

ఆగి ఆగి వీస్తున్న గాలుల్లో,

తెల్లని పరుపులు, వాటి మీద గుండ్రని దిండ్లు,

చేతిలో ద్రాక్ష రసం తో నిండిన పాత్ర , అయిపోగానే నింపే సాకీ లతో,

ఒక సాయంత్రమైనా అలాంటి ఉర్దు ముషాయిరా లో,

ఒక షాయరీ అన్నా వినాలన్న కోరిక…

ఎన్నటికీ నెరవేరని కోరిక…

విషాదాన్ని కూడా ఆనందంగా అనుభవించేది అప్పుడేనేమో…

విరహం కూడా తీరకుండా వుంటే బావుండనిపించేది కూడా అప్పుడేనేమో…

అలాంటి సాయంత్రం రాలేదు కానీ, చదవగానే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించినవి… అలాంటివి కొన్ని పై పుస్తకం లో వున్నాయి…

మచ్చుకి కొన్ని…

*ఉర్దూని తెలుగు లో చదవటం కంటే ఇంగ్లిష్ లో చదవటం తేలిక… అందుకే ఉర్దూ కవిత, దాని భావం రెండూ ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను

#

Sunee hikaayat-e-hastee

To darmiyaan sey sunee

Na ibtidaa ke khabar hain

Na intihaa maaloom

Meaning:

When I woke to the story of life,

it was already the middle of the tale,

I know nothing of the beginning,

I’ll know nothing of the end.

#

Khuda tujhey kisee toofaan sey aashnaa kar dey

Ki terey behr kee maujon mein iztiraab naheen

Meaning:

May god grant you the experience of a storm,

The waves of your life’s  ocean are too calm.

#

Khvaab tha ya khayaal tha kyaa thaa

Hijr tha ya vishal thaa kyaa thaa

Chamkee bijlee see par na samjhey hum,

Husn thaa ya Jamaal thaa kya thaa

Meaning:

Was it a dream or a memory of you, I do not know

Was it a separation from you or union, I do not know

Was it lightning that flashed before me, I do not know,

Was it your beauty or his splendor, I do not know.

ఇంతకంటే ఇంకా ఏం కావాలి????

నేను, మరో నేనుతో అసలు నేను… బుధవారం, జూలై 17 2013 

వ్రాసి చాలా రోజులయ్యింది… పెన్ను తుప్పు పట్ట బోయి ఆగింది, తను ప్లాస్టిక్ అని…

‘కీ’ బోర్డు కీసూ మొరాయిస్తున్నాయి…

చదవటం తగ్గనందువల్ల కళ్ళు మాత్రo, మెదడు తో పోటీ పడుతున్నాయి

వ్రాయాలీ ఈ ఈ ఈ ఈ ఈ …. అన్న ఒక్క కోరిక వల్ల పెన్నుని విదిల్చి, బుర్ర యొక్క డొక్క లో తన్ని

మనస్సుని పరుగులు పెట్టించాలనుకున్నా చేతి వేళ్లు మొరాయిస్తున్నాయి…

స్టార్టింగ్ ప్రాబ్లం కదా…

“Today as always, men fall into two groups: slaves and free men. Whoever does not have two-thirds of his day for himself, is a slave, whatever he may be: a statesman, a businessman, an official, or a scholar.”

― Friedrich Nietzsche

 

మా బాబే… మా బంగారే… ఎంత బాగా నిర్వచించావురా తండ్రీ, మా బానిస బతుకుల్ని అనిపించింది. అలా అని నా మీద నేను జాలిపడేంతలో, నాలోని మరో ‘నేను’ ఖస్సున లేచింది… ‘యేవిటీ??? బానిస బతుకా? వుద్యోగాల్లేక ఎంత మంది ఏడుస్తున్నారో తెలుసా? అయినా ఉజ్జోగo, సజ్జోగo చేయకుండా ఏం చేస్తావూ?’ అని దులిపేసింది.

ఈ బానిస బతుకులో అలసిన మొదటి ‘నేను’, ఆ మరో ‘నేను’ కి రిప్లై ఇవ్వటం కూడా దండగని మానేసింది.

ఎందుకంటే ‘నేను’ వ్రాయమంటోంది, ‘వేలు’ వూరుకోమంటోంది.

 

అసలే ప్రపంచ తత్వవేత్తల గురించి చదువుతున్నట్టున్నాను… చిర్రెత్తి వున్నాను…

 

వుందని అన్నోడితో లేదనీ… లేదని అన్నోడితో వుందనీ…

వుండీ లేదని అన్నోడితో, ఏదైనా ఒకటే అనీ…

నాలుకని మూడు వందలా అరవై డిగ్రీ లకీ తిప్పేస్తున్నాను.

వున్నా, పోయినా మనకొచ్చేది  లేదని…

ఇంకా ఏదో చెప్పబోతుంటే, లెన్త్ ఎక్కువవుతుంది ఆపూ..అంటూ ‘నేను’ లేచింది.

వుంటే నీకేంటి? లేకుంటే నీకేంటి? నీ బానిస బతుకుని బాగు చేసుకోరా వెధవాయి… అని వెక్కిరించింది…

దానికి ప్రతిగా మరో ‘నేను’ లేవబోతుంటే… వేలు నోప్పేసి… ఇక్కడాగాం అందరం…

🙂

‘క’ రాజు కథలు బుధవారం, అక్టో 3 2012 

ఇన్ని రోజులూ ఈ పుస్తకం ఎలా మిస్ అయ్యానో తెలీట్లేదు. చలం గారు ఎక్కడో అన్నట్టు, కవి తన కోసం వ్రాసుకుంటాడు, అది చదివాక మనకేం అర్థమవుతుందనేది మన మీద ఆధారపడివుంటుంది. అర్థం చేసుకునేవాడికి మహాగ్రంథాలు అక్కర్లేదు, ఒక వాక్యం చాలు. సింగీతం గారు ఏ వుద్దేశ్యం తో ఇవి వ్రాసారో తెలీదు. హాస్యం ప్రధాన రసమే అయిన… నాకు ఎందుకో అంత కంటే ఎక్కువగా, ఒక్కో కథా ఒక్కో భయంకరమైన సెటైర్ లా అనిపించాయి.
తెలుగు లో హాస్యం అనగానే ఎక్కువ మందికి ‘జంధ్యాల’ గారే గుర్తొస్తారు. ఇక ఆయన్నే పొగుడుతారు. ఆయన గొప్పవాడే, కానీ ఇంకా గొప్పవాళ్లు ఎంత మంది మరుగున వుండిపోయారో అన్న సందేహం వచ్చింది నాకు, ఇవి చదివాక. నా చిన్నప్పుడు, నాలుగో తరగతి అనుకుంటా… అప్పుడు విడుదలయ్యింది, ‘ఆదిత్య 369’, నా చిన్నతనం లో నేను అద్బుతంగా ఫీల్ అయిన విషయాల్లో ఆ సినిమా ఒకటి. ఆ తర్వాత కొంతకాలానికి ‘భైరవ ద్వీపం’ వచ్చింది, మరో మెస్మరైసర్. అసలే చందమామలు, బాలమిత్రలు తెగ చదివేస్తున్న రోజులు… ఈ సినిమా చూశాక నా ఆనందానికి అంతే ముంటుంది…

 

మళ్ళీ ఇన్నాళ్లకు, కేవలం ఆయన పేరు చూసి ఈ పుస్తకం కొన్నాను, నా చిన్నప్పుడు ఆయన సినిమాలతో ఎంత మెస్మరైస్ చేశారో… ఈ పుస్తకం తో అంతకంటే ఎక్కువే మ్యాజిక్ చేశారు.
కొన్ని కథలు…. ఏమని పొగడాలో నాకు తెలీట్లేదు.
సింగీతం గారూ .. మీరు ఇక్కడ పుట్టడం మా అదృష్టం.
కథల్ని నేను వివరించను… మీరంతా ఈ పుస్తకం కొని చదవాల్సిందే… కొన్ని అద్బుతాల పేర్లు మాత్రం ఇక్కడ….
1. గొప్పవాడు
2. నిజాల గోడ
3. పురోగమనం
4. భజన విజయం
5. ఉత్తరజిత్తు – దక్షిణజిత్తు

ఇవన్నీ చదివాక… ఇవేవో, నేటి సమాజం మీద సెటైర్ల లా అనిపించినా, లేక ఇది ఫలానా వ్యక్తి ప్రవర్తనలా అనిపిస్తోందే అని మీకు అనిపించినా. అది కేవలం మీ ఊహ… అంతే…
కానీ ఒకటి మాత్రం నిజం… మీరెన్ని చదివినా… ఇది చదవక పోతే మాత్రం లోటే…

నేడే చదవండి… తప్పక చదవండి 😉

సీలు విప్పని బుర్రలు బుధవారం, సెప్టెం 19 2012 

బుద్ది లేదు అనాలో… బుర్ర వాడరు అనాలో… తెలీదు…

మొక్క నాటి, కంచె వేసి, నీళ్ళు పోసి, మనుషులకి జీతాలిచ్చి…

కంటికింపుగా పెరిగాక…. అకస్మాత్తుగా ఒక రోజు వచ్చి మొత్తంగా నరుక్కొని వెళ్ళే వాళ్ళని HUDA అధికార్లు అని అంటారని నాకు మొన్ననే తెలిసింది…

మరి వీరికి బుద్ది లేదు అనాలో… బుర్ర వాడరు అనాలో… అర్థం కావట్లేదు…

 

వాళ్ళని అని ఏం లాభం లెండి… వసారా లో ఆకులు పడుతున్నాయనో… వేరు పెరిగితే  కాంపౌండ్ గోడ పగుల్లిస్తుందేమో అని ఎదిగిన చెట్లని నరుక్కునే మనకి చెట్ల విలువ ఏం తెలుస్తుంది?

చెట్టు అడ్డు వస్తే, ఇళ్లల్లోంచి పెంచుకుంటున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు… అయినా మనకెందుకు లెండి… ఎలా చేస్తే  రెండు పేపరు డబ్బు ముక్కలు వస్తాయో అలా చేద్దాం… ఎలా కొంచం ఒళ్ళు వంచే పని తప్పితే, అలా చేద్దాం…

అవీ… ఇవీ… శుక్రవారం, ఆగ 10 2012 

ఫుట్టిన  రోజులు – 1st  బర్త్  డే లు

అక్షరాభ్యాసాలూ  – బడి లో మొదటి రోజులు

స్లిప్ టెస్టులు – యూనిట్   టెస్టులు

సమ్మర్ హాలిడేసూ – చుట్టాలింట్లో వెకేషన్లు

కొత్త తరగతులు – బోర్డ్ ఎగ్జాం లూ

కాలేజు లు  – క్లాస్  బంకులూ

అమ్మాయిలూ – అబ్బాయిలూ

బెస్ట్ ఫ్రెండ్సూ  – పోటీ శత్రువులు

ఫలించిన ప్రేమలు – ఫలించని బ్రేక్ అప్ లు

విఫల ప్రేమలు – వికసించిన హ్రుదయాలు

బీ యస్సీలు – బీ టెక్ లు

ఎం టెక్ లు – పీ హెచ్ డీ లు

ఇంటర్వ్యూలు – జాబులు

నౌక్రి లు – మాన్స్ టర్ లు…

సాఫ్ట్ వేర్ లు – కాల్ సెంటర్ లు…

సీరియల్లు – సినీమాలు

సైకిల్లు – బైకులు

180 సీ సీ  లు – సెల్ఫ్ స్టార్టర్లు

కార్ లు – ఫ్లైట్లు

హాచ్ బాక్ లు – సెడాన్ లు

వొల్వో లు – గరీబ్ రథ్ లు

మాట్రిమోని లు – జాతకాల్లో గణాలు

ఫేస్ బుక్ లు – ట్విట్టర్ లు

మల్టి ప్లెక్స్ లు – ఐ మాక్స్  లు

ఆన్ సైట్ లు – వర్క్ ఫ్రం హోం లు

క్రెడిట్ కార్డ్ లు – నెట్ బ్యాంకింగ్  లు

5 రోజుల పనులు – లాంగ్ వీకెండ్ లు

బాచులర్ పార్టీలు – గోవా టూర్లు

లివ్ ఇన్ లు – సింగపూర్లొ హనీమూను లు

5’6” ఫెయిరు  –5’ 2” వెల్ సెటిల్డ్

పెళ్ళి షేర్వానీ లు – రిసెప్షన్ సూటులు

ఫేక్ లు – రియల్ టైం లు

ప్లే స్కూల్ లు – లక్ష (ఆల్ ఇంక్లూసివ్  లు)

టెక్నో స్కూల్ లు – ఇంటిగ్రేటెడ్ టీచింగ్  లు

హాస్టళ్ళు – పేయింగ్ గెస్ట్ లు

డబ్బింగ్ సినీమాలు – బాక్స్ ఆఫీస్ రికార్డ్ లు

గాలాక్సీ లు, ఆండ్రాయిడ్ లు, ఐ ఫోన్లు, ఐ పాడ్ లు, ఈ చెవులు… ఈ కళ్ళు…

మెడిక్లైం లు – కాష్ లెస్ ట్రీట్ మెంట్ లు

స్ట్రెస్ లు – ఓసీడీ లు

డయాబెటిస్ లు – హార్ట్ లో స్టంట్ లు

రిసార్ట్ లు – నేచర్ క్యూర్ లు

బట్ట తలలు – మొక్కుల గుండులు

హేర్ వీవింగ్ లు – లైపో సక్షన్లు

జాగింగ్ లు – రాగింగ్ లు

వాకింగ్ లు – స్విమ్మింగ్ లు

డుప్లెక్స్ విల్లా లు – 120 ప్లాట్ లు

మెయిల్లు – మెసేజ్ లు

చావులు – తద్దినాలు

):  (:

I know what i did in October… గురువారం, నవం 3 2011 

What a wonderful month was October!!! It was a perfect blend of leisure and work…
Half a month of holidays and a half months work… a great symphony…
Holidays were perfect… if one can quantify the ‘quality’ in a quality time, then mine would compete with the best…

What did I do?
I did what I liked…
Eat, sleep, watch, read… (my preferred order is from right to left ;))
What I read?
1. “Ramayana vishavruksham” by Ranganayakamma… it just shattered many myths… wonderful book…
2. “Sweet home” again by Ranganayakamma… it was fun… just like rom com…

What did I watch?
1. Indiana Jones and the Temple of Doom. Long waited to watch this movie as this was the only one left unseen in the series… a bit disappointed when compared with other movies. 
2. Dookudu : fun watching… hilarious…
3. Ratatouille: good one…
4. Monsters Inc: Amazing idea… great movie… enjoyed thoroughly…
5. Complete Pixar shorts: few were good… few I dint understand.
6. The Davinci Code: amazed with the idea of ‘royal blood’ and with the new version for the ‘holy grail’. Gripping screenplay… will watch ‘Angels and demons’ too…
7. Pirates of the Caribbean: The Curse of the Black Pearl : Timepass….
8. Gods must be crazy – I
9. Gods must be crazy – II –Found awesome…
10. Before sunrise
11. Before sunset : amazing movies… just loved them…
And the best of the movies…
12. Back to the future – I
13. Back to the future – II
14. Back to the future – III

Amazing movies… just fida…

ofcourse… love at first sight with… ‘Cluadia wells’ 😉 what a beauty!!!

A heartbreak too… 😦

హకూన… మటా…డ ;) శనివారం, ఆగ 13 2011 

రాజకీయాలూ, సినీమాలూ, క్రికెట్టూ, ఆటలూ, కథలూ, కాకరకాకాయలూ బోరు కొట్టేశాయి…
ఉద్యమాలు ఎక్కువయ్యి… రాజకీయాలు బోరు…
ఐ.పీ.ఎల్, వరల్డు కప్పులు… క్రికెట్టు బోరు…

సామెత చెప్పినట్టు.. “కక్క తింటే గారె చేదని”…

హిట్లు లేని సినీమాలు బోరు…
పాటలంటారా!!! ఈ రోజు నచ్చింది రేపటికి బోరు…

సాంప్రదాయ న్రుత్యాలూ, నాటకాలూ అంటారేమో, అబ్బే మనకస్సలు కుదరదు…
పోనీ ప్రక్రుతీ, భావుకతా అంటారేమో…
భలేవారే… అసలు అంత టైమెక్కడేడ్చింది…

పైగా అ రెండింటినీ తెలుగులో ఆస్వాదించాలి… ఇంగ్లీషు స్వంతది కాదాయే…
పోనీ తెలుగులో అస్వాదిద్దామా అంటే… అంత తెలుగు రాదాయె…

సర్లెండి, ఇవన్నీ ఆలోచించకూడదు…
మనసు పాడవుద్ది…
మీకు మరీ అంత మునిగిపొయే పనులేం లేవంటే…
సరదాగా అలా త్రేతా యుగం వరకూ వెళ్ళొద్దాం వస్తారా???
పనంటే…మరేం లేదు…

ఈ మధ్య మా సంఘం… అదే…
క.తి.క.తా.క.బ సంఘం అండీ…
అబ్బా… అంటే… కలలు తిని, కలలు తాగి,కలల్లో బతికే సంఘం…
దాని ఏకైక సభ్యుడిగా … కొన్ని పనులు నెత్తి మీద వేసుకున్నాను…
అందులో మొదటిది…

ఉటోపియా ఎక్కడుందో కనుక్కోవడం…
లాస్ట్ విసిట్ లో అన్ని కాలాలూ, ప్రదేశాలూ గాలించినా అది కపడలేదు…
అందుకని.. నేనే దానికి రూపకల్పన చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను…

అదిగో..అప్పుడే చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తొచ్చాయి…
నేను డిజైన్ చేస్తున్న ఉటోపియా కి, రామరాజ్యం బ్లూ ప్రింటు ఏమన్నా పనికొస్తుందేమో అనుకొని
రామరాజ్యం చూద్దామని మొదటిసారి త్రేతాయుగానికి వెళ్ళాను…
కానీ అప్పుడు రాముడు ఇంకా రాజవ్వలేదు…
అడవుల్లో వనవాసం చేస్తున్నాడు… అందుకే వెనక్కి వచ్చి…

నా యుఫోరియాలో… ఊపులో… ఉటోపియా ని ఎడా పెడా డిజైన్ చేస్తూ బాగా బిజీగా తయారయ్యాను…

ఎందుకో తెలీదు…
ఒక రోజు సడన్ గా బోరు కొట్టింది.. ఏం చేస్తున్నా, ఏం చుస్తూన్నా బోరే…

అందుకే మళ్ళీ ఇలా యాత్ర మొదలుపెట్టాను…
అమ్మయ్య…ఇప్పటికైనా నీకు మొత్తం అర్థమయ్యిందనుకుంటా…

అదిగో… మాట్లాడుతూనే రామరాజ్యానికి వచ్చేశామే…

ఆయనేనా రాముడు… ఏమిటి ఒల్లంతా నీలంగా వుంది… మరీ మిథిలిన్ బ్లూ లో మునిగి తేలలేదు కదా…
మనకెందుకు లే..

“కొన్నీచ్చివా రామా సాన్ “?

ఖంగారు పడకు… జపనీస్ లో అడిగాను…
దేవుడు కదా అన్ని భాషలూ తెలిసుంటాయిలే…

అదేంటి మొహం మాత్రం నీలం నుంచి తెల్లగా మారింది…
ఆ!!! తెల్ల మొహం…

హాష్చర్యం… ఈయనకు జపనీస్ తెలీదా…
పోనీ తెలుగు??? అదీ తెలిసినట్టు లేదు…

అదేంటీ??? ఈయన దేవుడు కాడా ఏంటి?

అసలే మనది సెకండ్ లాంగ్వ్యేజ్ సంస్క్రుతం…

ఈ భాషతో, యుటోపియా ని కాదు కదా… కనీసం ఆంద్రప్రదేశ్ ని డిజైన్ చేసేంత ఇన్ ఫర్మేషన్ కూడా రాదు…
ఈయన్ని సంస్క్రుతం నేర్చుకొని వచ్చి కలుద్దాం…

పద ఇప్పుడు…

వచ్చిన పని ఎలాగూ కాలేదు… ఇక ప్లాన్ లేకుండా పనులు చేసుకోవడమే మంచిది…

సర్లే… త్రేతాయుగం వరకూ వచ్చాం కదా, కొంచం దూరం అలా ద్వాపరయుగం వరకూ వెళ్ళి, క్రిష్ణుని పాలన కూడా చూసి వద్దాం…

అరే… క్రిష్ణుడు ఇంకా పెద్దవాడు కాలేదు…
అదేంటీ?? ఏం చేస్తున్నాడు???
దొంగతనమా? నిజమే!!! స్నేహితులతో కలిసి… చేస్తున్నాడు…
మందలిద్దామా అనిపించింది… కానీ పాపం మన కవులు గుర్తొచ్చారు… ఇప్పుడు నేను క్రిష్ణున్న్ని మందలిస్తే… ఆయన దొంగతనం మానేశాడనుకోండి… మన కవులూ, ప్రస్తుతం టీ.వీ సీరియలు వాళ్ళూ ఏమవుతారు??? అసలే ప్రస్తుతం తెలుగు లో కూడా డబ్బింగ్ సీరియల్లతో టీ.ఆర్.పీ లు పెంచుకుంటున్నారు… అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని… మరీ ఇంత దూరం వచ్చి మాట్లాడకపోతే బావోదని, పైగా ఇందాక రాముడి తో వచ్చిన భాషాభేదం గుర్తుంది కాబట్టి… శుద్దమైన హిందీ లో బావున్నరా??? అని అడిగాను…
కానీ అర్థం కాని భాషలో ఆయన ఏదో అన్నాడు… బహుశా అవధి నో, మరోటో…
నాకైతే అర్థం కాలేదు…

కానీ, ఒక్కటి మాత్రం బాగా అర్థమయ్యింది… ఇంకొంచం సేపు అక్కడే వుంటే మాత్రం… నలుగుర్నీ పిలిచి..అక్కడ జరిగిన దొంగతనం నా మీదకే నెట్టేట్టున్నాడు… మనకెందుకొచ్చింది… చెప్పండి…

కానీ తర్వాత అలోచిస్తే అర్థమయ్యింది ఏమిటంటే… నేను వాళ్ళని కలిసినప్పటికి వాళ్ళింకా దేవుళ్ళు కాలేదు… తర్వాత మనవాళ్ళెప్పుడో తీరిగ్గా వాళ్ళని దేవుళ్ళని చేసుంటారు…పాపం…

ఇక భారతదేశం మొహం మొత్తి…
చైనా పెద్ద గోడెక్కి (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా)చూసి… ఆ అందానికి తరించి… ‘పియోలియాంగ్’ అని అప్రయత్నంగా అనేసి…
అక్కణ్ణించి… బాబిలోనియన్ వెళ్ళాడే తోటలోని మొక్కలోంచి ఒక పువ్వుని త్రుంచుకొని…
అక్కడ ఎగిరి… ఈజిప్టు పిరమిడ్ల మీద వాలి… మమ్మీగా మారుతున్న ఒకన్ని చూసి (శవాన్ని), ‘అహ్ల్న్ బీక్ ఫె మస్ర్” అని ఆశీర్వదించి…
రోము తగలబడుతుంటే… ఒక చెంచాడు నీళ్ళు చల్లి.. ఫిడేలు వాయిస్తున్న నీరో సంగీతం విని ముగ్దుడినై… ‘ఇడియొట ‘ అని ముద్దుగా తిట్టి…
మాచుపిచ్చు లో ప్రక్రుతి అందాలని ఆస్వాదించి…
కెన్యాలోని సుందరాంగికి ‘నాకు పెండ ‘ అని చెప్పి…
కోపంగా పక్కనుంచొచ్చిన వాళ్ళాయనని చూసి దడుసుకొని…
కిందపడితే…
ఇదిగో… నా మంచం కింద నుంచి లేచాను…

మా సంఘం మీటింగ్ ముగిసింది…
మరో రోజు మొదలయ్యింది… అయినా..

హ..కూన… మటా…డ…

ఎందుకంటే… ప్రతీ ఉదయం తర్వాత ఒక రాత్రి వస్తుంది…

ప్రస్తుతానికి…

హాస్త ల విస్తా…బేబీ 😉

తర్వాత పేజీ »