దేవుడా… రక్షించు… నాకక్కర లేనివాటినుంచి… సోమవారం, ఏప్రి 12 2010 

దేవుడా., రక్షించు, నన్నూ… నా స్నేహితుల్నీ…
కాలుష్యం నుంచి… మనసుల్లోని మాలిన్యం నుంచి,
థియరీల నుంచి… ప్రాక్టికాలిటీ నుంచి,
ఆత్మన్యూనత నుంచి… ఇడెంటిటీ క్రైసిస్ నుంచి,

జాతకాల్నుంచి… అద్బుత దవాఖాన్ల నుంచి,
మీడియా నుంచి…బ్రేకింగ్ న్యూస్ ల నుంచి,
అంకెల నుంచి… “కోట్ల” సంఖ్యల నుంచి,
ఉంటే రిసెషన్ నుంచి…లేకపోతే టార్గెట్ల నుంచి,

డొనేషన్ల నుంచి… ఇన్స్యూరెన్స్ ల నుంచి,
క్రెడిట్ కార్డుల నుంచి… EMI  ల నుంచి,
ట్యాక్స్ ల నుంచి… సేవింగ్సుల నుంచి,
ఓవర్ టైం ల నుంచి… ట్రాఫిక్ జాం ల నుంచి…

దేవుడా., రక్షించు, నన్నూ… నా స్నేహితుల్నీ…
అతి వినియోగం నుంచి… అనవసర డాంబికాన్నుంచి,
చెత్త సినీమాల నుంచి… చిల్లర టీవీ షోల నుంచి,
వ్యర్థ మొబైల్ల నుంచి… వాటి యాడ్ ల నుంచి,
ప్లాస్టిక్ నవ్వుల నుంచి… ప్లాస్టిక్ నుంచి,

పైశాచిక ప్రేమల నుంచి… కన్ ఫ్యూస్డ్ బంధాల నుంచి,
గ్లోబల్ వార్మింగ్ నుంచి… గ్లోబ్ మీద పెరుగుతున్న కాంపిటీషన్ నుంచి,
క్రుత్రిమత్వం నుంచి… భ్రమల నుంచి,
లేనివారి కన్నీటి వరద నుంచి…మంచి నీటి కొరత నుంచి,

దేవుడా… భయపడకు… ప్రయత్నించు…

దయచేసి… సిన్సియర్ గా ప్రయత్నించు… ప్లీజ్… :(

ఫిలాసఫీ… ఆదివారం, మార్చి 21 2010 

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

..

.

.

.

.

.

.

.

.


.

.

.

.

.

.

.

.

.

.

.

. :)

Why i don’t understand??? శుక్రవారం , Feb 12 2010 

I don’t understand how ignorant I’m. The more I read her works, the more am getting EAHHHH….

I brought this book called “The romantic manifesto”… recently when I opened… alas.. already two years past and I never completed it… six unsuccessful attempts were made to complete it… eh…

I read “Fountain head”, “Atlas shrugged”, “Anthem” and “We the living” but this one is where I got stuck. What she had to tell was very well expressed in a very, very simple manner in the first three books mentioned above… the most complex philosophy is presented in the simplest form in the actions of Roark, Rearden, Taggart, Galt etc…

When am reading this nonfiction work of her, really… am lost…

It is for sure, am going to complete this book and know what is mentioned that is not presented in their actions.

While writing this, I read the following (excerpt presented below) on RGV’s blog… and I got the answer… dumbo ooo

;)

Answer by RGV to one question…

Ques:::Why is Ayn Rand’s fiction work more popular than her philosophical non-fiction work?
Ans::: That’s because in fiction she just dramatically applies her non-fiction philosophy to practical aspects of our lives thereby using our emotions to send her message across as she very well understands that our intellect will be too low and too slow to be able to grasp her non-fiction philosophy.

పండు… పండు… ;) మంగళవారం, Feb 9 2010 

అనగనగా ఒక రోజు, ఒకే సంఘటన ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాల్లో జరిగింది…

మొట్టమొదట ఇంగ్లాండ్ లో… ఒక యాపిల్ చెట్టు కింద ఒకాయన కూర్చున్నాడు. పైనుంచి ఒక యాపిల్ పండు దబ్బుమని నేల మీద పడింది.అది బావుందో, లేదో చూస్కొని తినక, అదెందుకు కింద పడింది, పైకెందుకు పోలేదు అని పిచ్చి పిచ్చిగా ఆలోచించి. రీసెర్చీ గట్రా చేసి, భూమికి అదేదో శక్తి వుందని కనిపెట్టాడు… ఇంత వరకు చాలా బావుంది.

అదే రోజు అమెరికాలో కూడా ఒక పండు పడింది… అది యాపిలో మరేదో ప్రస్తుతానికి మనకనవసరం. వెంటనే అది చూసిన ఒకడు, మరో పది రోజులు అబ్జర్వ్ చేసి, ఎన్ని పళ్ళు పడుతున్నాయి, వాటి యావరేజ్ ఏంటి, వాటి క్వాంటిటి ఎంత అనే లెఖ్ఖలు వేసి, ఇన్ని చెట్లు ఇంత కాలం పెంచితే, ఇన్ని పళ్ళు పడతాయి కాబట్టి, ఇంత పన్ను కట్టించుకోవచ్చని ప్రూవ్ చేసి, బిల్లు పెట్టి రాజ్యాంగాన్నే సవరించాడు.

అలాగే అంటార్క్ టికా లో కూడా ఒక పండు పడింది. చెట్లే లేని ప్రదేశంలో పండు పడేసరికి, అదేదో చెత్త అని కనీసం దాన్ని చూడకుండా, పక్కన పడేసాడు అక్కడే పనిచేస్తున్న ఒక సైంటిస్ట్. పాపం ఆయన తప్పేం లేదులెండి. ఆయనేదో ప్రశాంతంగా ఏవో కొన్ని పరిశోధనలు చేసుకుందామని వస్తే, అక్కడా ఈ ప్లాస్టిక్ కాలుష్యం ఎదురయ్యింది. అందుకే ఆయనలో చిరాకు పెరిగింది… అంతే.

అఫ్ఘనిస్తాన్ లో పండు పడితే, పడ్డ ప్రతీ పండుకూ ఒక బాంబు చొప్పున అమెరికాలో పేల్చాలని తీర్మానించారు. ప్రస్తుతం మానవ బాంబుల తయారీలో వాళ్ళు చాలా బిజీ…

పాకిస్తాన్ లో అయితే, పండు పడ్డా బాంబేమోనని జడిసి పెరిగెత్తారు.

ఆస్ట్రేలియాలో పడ్డప్పుడు. అది అక్కడి చెట్టుదా లేక ఆ చెట్టు మూలాలు ఇండియాలో వున్నయా అని చూసి, అవి ఇక్కడివని తెలిస్తే, ఆ చెట్టుని కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి, చివరికి పెట్రోలు పోసి తగులబెడుతున్నారు.

ఆఫ్రికాలో అయితే, చచ్చిపోయిన కాకి పైనుంచి పడితే, అదేంటో కూడా చూడకుండా పండు అనుకొని క్షణాల్లో తినేశారు…

ఇలా వివిధ దేశాల్లో… ప్రదేశాల్లో ఒక్కొక్కటి చొప్పున పళ్ళు పడ్డాయి.

కానీ భారత దేశం వేద భూమి కావడం చేత…
ప్రక్రుతి పులకించి ఒకే సారి, 28 రాస్ట్రాల్లో 28 పళ్ళు పడ్డాయి…

అంతలో అందులో కొన్ని పళ్ళు మావని చైనా, కొంత మాదని పాకిస్తానూ గొడవ చెయ్యడంతో, ఇండియా బుద్దిగా ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది… నా దేశంలో పడే పళ్ళు నావే అని మీరు చెప్పండి అని అంది. పిల్లీ, పిల్లీ, గొడవపడి, కోతిని అడిగినట్టు… ఆ గొడవ తీరలేదు,

ఇంతలో ఒక చోట, పడ్డ పండు హరిజనులది కాబట్టి, హరిజనులంతా నా పుట్టిన రోజు నాడు ఈ పళ్ళనే సమర్పించుకోవాలి అని ఒకరి ఆజ్ఞ.
ఇంకో చోట ఏ పండు పడ్డా దాన్ని మా భాషలోనే పిలవాలి, లేకపొతే, అసలు ఆ పండునే పండనివ్వం అని గొడవ.

ఇక పోతే అన్నపూర్ణ.. వేరే చొట్ల లాగా ఇక్కడ పండు పడితే ఎవరికీ ఏం ఇబ్బంది లేదు… అసలు పడడానికి ఆ పండే ఒక సారి అలోచించుకోవాలి. ఎందుకంతెద.. ఎప్పుడు వరదలొస్తాయో, ఎప్పుడు కరువొస్తుందో తెలీదు. ఏ ప్రాంతంలో పడితే, ఏ ప్రాంతం వారు కొత్తుకుంటారో తెలీదు. ఒక పండు పడటం చూస్తే, మొత్తం పిందెలతో సహా ఎక్కడికి తరలిస్తారో తెలీదు… ఇన్ని సమస్యల మధ్య… ఎప్పట్లాగే ఆ పళ్ల చెట్టు వేరే రాస్ట్రాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించాలి…

Other states… బుధవారం, Feb 3 2010 

Solid
Liquid &
Gas

The three pure physical states of matter known to us…
What could be the fourth state? I cant imagine one, even if one exists, how it could be and what are its properties???

A sarcastic thought is that the fourth state could be the “Feelings” of us, like love, hate, peace, rage… whatever it may be.

Feelings deemed to be fit into the fourth state.

They are hard, they are volatile, invisible, weak, strong, peaceful, violent… any form they can take & be… Biochemically they may be the result of few nanogram of chemicals either solid or liquid in state acting on the neurons either mechanically, chemically or electro chemically but finally disappearing into…and reappearing as actions strongly bound by feelings.

Have you ever thought of roots and route of the thoughts or feelings???

Have you ever felt why you should feel?

Whats the process going on in my mind? The neurons, the dendrites , the reflexes, the chemicals that make you feel elated, exhausted, angry, laugh…

Is this all???

A complex chemical or electro chemical reactions in few tissues, that make you great or cheat, love or hate???

Funny… there’s nothing??? If I classify the feelings as 4th state, then definitely I should also have something in 5th state. Mmmmm… it may be the “SOUL”. 

Soul…a result of very very complicated combinations of the feelings. It must be existing in 5th state, which yet we have to theoretically propose, discover and prove in the experiments. Then scientists may reproduce it in the lab. May be it will be something like antimatter. May be in future, we may have test tubes or beakers to hold the soul. Different sizes and different shapes. May be we can have a library of them named as “5th state library”.

May be hell and heaven are in 6th state and god in 7th or 8th state and may be something is also existing beyond 8th.. may be in 9th or 10th state where electrical, chemical, mechanical, physical material forces are void and something different might be existing.

Hell with all these… whatever it is… nothing is greater or above than me…I think I should bother only about my states…

Bread in solid state,
Wine in liquid state,
Her fragrance in the gaseous state… it’ll be cool…

వెనక నుంచి మొదలయితే… గురువారం, జన 28 2010 

కొన్ని కొన్ని సార్లు… జరిగే విషయాలని చూస్తుంటే చిరాకేస్తుంది… అప్పుడనిపిస్తుంది.. ఈ స్రుష్టిలో కొన్ని మార్పులు చెయ్యాలని… ఇప్పుడు కుదరదు కాబట్టి, ఈ అనుభవాలని గుర్తుపెట్టుకొని వచ్చే స్రుష్టిలోనైనా , ఆ మార్పులు చెయ్యాలి.

మొట్ట మొదటి మార్పు…

మనిషి జీవితం స్మశానం నుంచి మొదలవ్వాలి… చితి నుంచి లేచి రావాలా అనేది తర్వాత డిసైడ్ చేద్దాం… కాకపోతే, నేను చెప్పాలనుకున్నదేమిటంటే…

ప్రస్తుత పరిస్తితులలో… ముందేం జరుగుతుందో తెలీట్లేదు… ఈరోజు గొప్పతనాన్ని గుర్తుపట్టలేకపోతున్నాను… స్కూల్లో వున్నంత కాలం, తొందరగా కంప్లేట్ చేసి… కాలేజిలో చేరాలని… అందులో చేరాక… అదీ తొందరగా ముగించి, వుద్యోగంలో చేరాలని… అందులో చేరాక ఇంకేదో కావాలని… అప్పుడప్పుడు అలోచిస్తే… అబ్బా… కాలేజ్ డేస్ లైఫ్ లో గోల్డెన్ డేస్ అని, అబ్బో స్కూల్ డేస్ అయితే డైమండ్ డేస్ అనీ…
ఇలా అనిపించటం…

దీనికంతటికీ కారణం, ఇలా రేపటి రోజు బావుంటుందన్న ఆశతో ఈ రోజుని నిర్లక్య్ష్యం చెయ్యడం…

అదే, చావు నుంచి బతికితే… బ్రతుకు తీపి ఎక్కువగా తెలుస్తుంది.. పని నుంచి కాలేజ్ కి వస్తే… ఇంకా బాగా చదువుకోబుద్దవుతుంది… అక్కణ్ణించి స్కూల్ కి వెళ్తే… అబ్బో అన్నింటిని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు…

అప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి అలోచనలు కూడా రావసలు…

ఒక రోజెల్లి పోయింది మంగళవారం, జన 26 2010 

“ఒక రోజెల్లి పోయింది, వెళ్ళిపోయిన రోజు గురించి అలోచిస్తుంటే, ఈ రోజూ వెళ్ళిపోతుంది” ఇలా మొదలయిన ఆ కథ ప్రతీ రోజూ జ్ఞాపకానికి వస్తుంది. అమరావతి కథలు మొత్తం ఒక ఎత్తయితే, ఇదీ, మరో రెండు మూడు కథలు కలిపి మరో ఎత్తు. చదవగానే హత్తుకొని, కొన్ని రోజులు/నెలలు/సంవస్త్రాలు గుర్తుండిపోయే కథలు చాలా తక్కువ. అలాంటి వాటిల్లో ఇదొకటి. ఈ కథ ఎందుకు నచ్చిందా అని అలోచించలేదు. ఎందుకంటే, అలోచిస్తే, ఖచ్చితంగా ఒక్క కారణం మాత్రమే వుండదు. ఈ కథని, ముక్యంగా ఇందులోని థీం ని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న చాలా ప్రాబ్లంస్ కి రిలేట్ చేసుకోవచ్చనుకుంటాను. నిలబడి మినరల్ వాటర్ తాగటం కంటే, పరిగెత్తీ, పరిగెత్తీ బూస్ట్ తాగితే గానీ సంతొషించని మనకి, పిచ్చయ్యగారి జీవితం ఒక ఓటమిలాగా అనిపించొచ్చు. నాకూ మోదట అలాగే అనిపించింది. కానీ అలోచిస్తే, మనకి ఒక పరుగు కావాలి, గెలుపు కావాలి లేదా ఓడిపోవాలి… మళ్ళీ పరిగెత్తాలి. సెలబ్రేషన్ కి ఒక అకేషన్ కావాలి (గెలుపో, ఓటమో), డిస్కషన్ కి ఒక టాపిక్ కావాలి. ప్రతీ విషయంలో కాంపిటీషన్, స్టాటిస్టిక్సు, సర్వే లు .. ఇంతే… ఇలా చూస్తే, పిచ్చయ్య గారు గెలవలేదు, కానీ ఓడిపోలేదేమో కూడా. ఖచ్చితంగా వాటికతీతంగా మాత్రం బతికారు. పరిగెత్తేవాళ్ళనీ, గెలిచేవాళ్ళనీ, ఓడిపొయేవాళ్ళనీ, చూస్తూ వినోదంగా గడిపారనిపిస్తుంది. ఎక్కడో చలం అన్నట్టు “జీవితాన్ని, బయటినుంచి ఒక ప్రేక్షకుడిలా చూస్తే బావుంటుందని…”, అలా గడిపాడేమో జీవితాన్ని. ఇంకా ఈ కథ గురించి ఎన్నో అనుకున్నను. అన్నీ వ్రాయలకున్నాను. కానీ చెప్పుకోవాల్సిందింతే అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ రాస్తే, మ్యాటర్ డైల్యూట్ అవుతుందేమోనని భయం. అయినా, రెండు పేజీల కథకి నాలుగు పేజీల టపా రాస్తే, చిరాగ్గా వుండదూ.. అర్థం చేసుకునేవాడి అద్రుష్టం అన్నట్టు ఆయనేమో రెండు, మూడు పేజీలే వ్రాశారు. ఇంతకూ, ఇప్పటివరకూ మరెవ్వరూ ఆ పుస్తకం మీద నాలుగు వాల్యూం ల థీసిస్ రాయలేదేమో పీహెచ్ డీ కోసం ;) నాలుగు పుస్తకాలంత పాత్రల విశ్లేషణ బదులు, నలబై పేజీల కథ చదివి అర్థం చేసుకుంటే చాలదూ… చాలదనే అనుకుంటారు చాలా మంది… :)


ఇష్టం బుధవారం, జన 13 2010 

నిన్నిష్టపడ్డందుకు, నా మీద నాకే ఇష్టం పెరిగింది.
ఆ ఇష్టం నీ మీద ఇష్టాన్ని ఇంకా పెంచింది.
ఇప్పుడు నాకందరూ ఇష్టమే, అంతా ఇష్టమే…

ఇలా జరిగితే ఎంత బావుండేది ;)

కపిత్వాలూ – అనుభవ రాహిత్యం… :( సోమవారం, జన 11 2010 

నిజం చెప్తుంటే నమ్మవేం?
నువ్వు వేకువజామునే లేచి,
వేసిన ముగ్గు చూసుకొని,
త్రుప్తిగా చిరునవ్వు రువ్విన తర్వాతే,
లోకానికి వెలుగు వస్తుందంటే…

***

నిజంగా నేనిప్పుడు భక్తున్ని,
నిన్న సాయంత్రం నువ్వు,
పరికిణీలో….
గుడికెళ్ళడం చూసినప్పటినుంచీ.

***

కేవలం…
నిన్ను చూడటం కోసం,
ఈ పగలంతా ఆ వీధి మొదట్లో గడిపాను..
నా పిచ్చి గానీ,
నిద్రపోతే సరిపోఅయేది,
మరి నా కలల్లో ఎప్ప్పుడూ నువ్వే కదా!!!

***

ఫ్రిజ్ లోని కూల్ డ్రింక్ పారబోసి,
కొబ్బరిబోండాం తెచ్చి తాగుతుంటే,
అమ్మ వెర్రిగా చూసింది :)
అమ్మకేం తెలుసు పాపం!!!
నీకు కొబ్బరిబోండాం ఇష్టమని,
నిన్న నువ్వు నాకు చెప్పిన సంగతి ;)

***

నేన్నమ్మలేదు…
నా జీవితంలో అద్బుత మార్పులు
జరుగుతాయని జ్యొతిష్యుడు చెపితే,
ఋజువు కోసం చూస్తుంటే…
కోవెలలో  ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటూ,
నువ్వు కనిపించావు…

***

పెన్ను పట్టుకొని,
పేపర్ ముందేసుకున్నాను…వ్రాయడానికి…
ఏం లాభం?
నువ్వుంటే వెయ్యి భావాలు…
లేకుంటే శూన్య విచారాలు…

***

చైత్రం  నుంచి మాఘం వరకు సాగే ప్రయాణంలో…
తప్పక కార్తీకాన్నీ, అందులో వసంతాన్ని…
ఆనందిస్తానని తెలుసు.
అందుకే చైత్రం వస్తూ…
గ్రీష్మాన్నీ తెస్తుందని బాధపడను…

2 States… ఆదివారం, జన 10 2010 

రెండు రాష్ట్రాలు,రెండు సంస్క్రుతులు, ఇద్దరు ప్రేమికులు, ఒక పెళ్ళి…

పూర్తిగా ఒక భారతీయ ప్రేమ కథ. ఇదీ చేతన్ భగత్ “2 స్టేట్స్” నవల.

ఒక పంజాబీ అబ్బాయీ, ఒక తమిళమ్మాయి ప్రేమించుకుంటే, ఆ ప్రేమని పెద్దల అనుమతితో పెళ్ళి వరకు తీసుకెళ్ళడానికి ఏమేం చేయ్యాల్సొచ్చిందనేది కొంచెం హ్యూమరస్గా, అక్కడక్కడా సీరియస్గా చెప్పారు.

IIMA లో మొదలయ్యి, ఢిల్లీకి వెళ్ళి, అక్కణ్ణించి చెన్నైకి వెళ్ళి, మళ్ళీ ఢిల్లీకి వచ్చి… మధ్యలో గోవాలో ఆగి. చివర్కి… D-C-D-C ల్లో షట్టిల్ చేసి చివరికి చెన్నై లో ముగుస్తుంది. చేతన్ narration బావుంది. చివరి వరకు చదివింప చేస్తుంది. నిజానికి సెలవు రోజుల్లో చదివాను కాబట్టి, నాన్-స్టాప్ గా నాతో చదివించింది… ఒకట్రెండు అతిశయోక్తుల్లాంటి సంఘటనలని కథలో వాడుకున్నా మిగతా అన్నీ రియలిస్టిక్ గా అనిపిస్తాయి… తన జీవితం లో జరిగిన సంఘటనలు కొన్ని ఇందులో వున్నాయని రచయితే ముందుగా చెప్పుకున్నారు… May be అందుకేనేమో…

ప్రేమించీ, పారిపోకుండా పెద్దల అనుమతితో ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారో చెప్పిన వాదన బావుంది. అలాగే ప్రేమలో పడ్డ తర్వాత ఎలాంటి బాధ్యతల్ని తీసుకోవాల్సొస్తుందో చదివితే ఫన్నీగా వుంది.

మొత్తమ్మీద సరదాగా చదువుకోదగ్గ పుస్తకం…

PS: మొత్తం కథ చదివాక, ప్రేమలో పడ్డాక,పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోవాలనుకుంటే, అబ్బాయే ఎక్కువ ఎక్కువ స్ట్రగుల్ అవ్వాలేమో అనిపించింది ;)

అబ్బాయిలూ జాగ్రత్త… ;)

తరువాతి కాగితం »

Follow

Get every new post delivered to your Inbox.