టీనేజ్ కపిత్వం ;) – మొదటి లేఖ సోమవారం, డిసెం 21 2009 

టీనేజి లోకి అడుగుపెట్టిన కొత్తల్లో, చదవటమే గాక వ్రాయలన్న కోరిక…
దేని గురించి వ్రాయలో తెలీని సంశయం…
చెప్తే ఎవరేమనుకుంటారో అన్న బెరుకు…

ఇవన్నీ వున్నా, ఆగక… ఆపుకోలేక…
. వ్రాసుకున్న పిచ్చి రాతలు కొన్ని, భద్రంగా దాచిన పుస్తకంలో మొన్న చదివాక…
నా మొహంలో చిన్న నవ్వు… ఏదో సంతోషం…

అంతలోనే ఏదో బాధ.. ఇప్పుడు చదవాడానికి టైం ఎంత కేటాయిస్తున్నాను అని???

ఏదేమైనా, ఆల్రెడీ.. శిధిలావస్తలో వున్న పుస్తకంలోని రాతలు ఇంకెంతకాలం వుంటాయో తెలీదు…
వీలున్నప్పుడు… అవన్నీ బ్లాగు లో పెట్టెస్తే… క్షేమంగా వుంటాయి కదా అని… అందులోనిదే ఈ మొదటి ప్రయత్నం…

మొదటి లేఖ:

నా ప్రేయసికి లేఖ రాద్దామని,
హ్రుదయంలోని భావాన్ని, మాటలలోకి అనువదిద్దామని,
కలం అందుకున్నాను…
కాగితాలు చూసుకొని వ్రాయటం ఆరంభించాను…
కాగితాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి…
సమయం గంటలలో గడిచి పోయింది…
కానీ నా హ్రుదయంలోని భావం సగం కూడా అవలేదు…
ఇంతలో, తను వచ్చి ఒక కాగితం అందించింది…
ఆ తెల్ల కాగితం లో ప్రారంబానికీ, ముగింపుకీ, మధ్యనున్న
ఖాలీ స్థలం… అనంత భావాన్ని, అంతులేని మాటలలో చిత్రీకరించుకుంది…
అదేం మాయో, నేనెప్పుడు తెరిచినా,
నా కోసం ఒక సరికొత్త భావం అందులో లిఖింపబడి వుంటుంది… :)

99 లో ఇది రాసుకున్నాను…
2009 లో కూడా ఇంతవరకు నా ప్రేయసి నాకు ఆ లేఖ ఇవ్వలేదు…
అసలెక్కడుందో… ఇంతకీ ఆ లేఖ రాసిందో?? లేదో??
కనిపిస్తే, వెంటనే అడగాలి… ;)

నువ్వూ+నేను… ఊ… కాదు… కాదు… “నేనూ+నేనే” గురువారం, నవం 26 2009 

నేనంటే నీకెందుకు అంత ఇష్టం?

ఎందుకంటే… ఊ… ఏమిటంటే…  నీలోని మంచితనం,  నీలోని అమాయకత్వం, నీ సిన్సియారిటీ, నీ ప్రవర్తన, నీలోని మర్యాద… నీ sense of humor… అబ్బో చెప్పాలంటే చాలానే వున్నాయి…

మరి నీలో నీకేం ఇష్టం…

నా కోపం… నా స్వార్థం… నా ఈగో…నాలోని చెడు…నా ముక్కుసూటితనం… ఎవ్వర్నీ పట్టించుకోని తత్వం… నా పొగరు… నా మొండితనం… నా మూర్ఖత్వం… అబ్బో చెప్పాలంటే చాలానే వున్నాయి…

మరి మన మనస్తత్వాలు కలవక, రేపు మనకి గొడవలొస్తే???

గొడవలా??? వస్తే బాధపడతావా?? సర్లె అయితే??? నాకే గొడవలూ వుండవు, అలాగే బాధలూ వుండవు!!! ఎందుకంటే నేనేమీ పట్టించుకోను…

అయితే…మన మధ్య ఏం జరిగినా బాధపడవా???

బాధా?? ఎందుకు??

ఇలా అయితే నీతో కష్టం… మనం విడిపోదాం… కనీసం దీనికైనా బాధపడవా…

ఉహూ!!!

నేనంటే కొంచం కూడా ఇష్టం లేదా??? మనం వి..డి..పో..తు..న్నాం!!! నేనిక నీ జీవితంలో వుండను… దీనికైనా బాధ లేదా???

ఉహ్… చూడూ… నువ్వంటే నాకానందం… అలాంటిది నువ్వే నాకు బాధని ఎలా ఇవ్వగలవు… నిన్ను నా ఆనందానికి కారణమనుకున్నాను… ఇప్పుడు నువ్వు నాతో వుండవని… నిన్ను నా విషాదానికి కారణమనుకోవాలా??? నా వల్ల కాదు… నాలుగు దశాబ్దాల తర్వాత, ఒకసారి నా దగ్గరకు రా… అప్పుడూ నీ వల్ల నేను ఇంతే ఆనందం పొందుతాను… సర్లే ఇంతకీ ఏంటీ??? మనం విడిపోదామా.. సరె.. విడిపొయ్యామంటే, ఇక సినిమా ప్రోగ్రాం కాన్సిలయిన్నట్టేగా… సర్లే నేను ఈ సాయంత్రం లైబ్రరీ కి వెళ్తాను… లేటయ్యింది.. ఇక నువ్వు వెళ్ళు… నిన్ను వారి బాధలకి కారణంగా కూడా ఊహించుకోగల వారిని పట్టుకోవాలిగా… ఎక్కువగా  వెతకక్కర్లేదనుకుంటా… చాలా మందే వుంటారు…

నేను నీ దగ్గరకు మళ్ళీ రాను.. తెలుసుగా నాకు పొగరు… వుంటా…  బై…

రాజకీయ నాయకులూ – ప్రయివేట్ కంపెనీలో CEOలు ఆదివారం, నవం 22 2009 

రాజకీయ నాయకులు కూడా మన కంపెనీ CEO లానో, లేదా  మనలాగానే పనిచేస్తున్నాని మనలో ఎంతమందికి తెలుసు ???

Just follow the below link, read the interesting and funny article by Mr. Nandan Nilekani and LOL  ;)

http://www.mouthshut.com/diary/bdbglonmo/Infoscion-now-politician

 

chalikaalam vaccheasindoach… ;) సోమవారం, అక్టో 26 2009 

గత కొన్ని రోజుల నా ప్రక్రుతి పరిశీలనలో తేలిందేమిటంటే… చలికాలం మొదలయ్యిందని  ;)

అసలు ఇది చలికాలమేమో అన్న అనుమానం ఎందుకొచ్చిందంటే… ఒక రోజు… ఆరింటింకి ఆఫీసు  బయటకి వచ్చి చూస్తే… చీకటి వ్యాపించింది… చిన్నగా చలి మొదలయ్యింది…

అలా అప్పుడు మొదలయిన చీకటీ, చలీ, పొద్దున్న ఆరింటికి కూడా పోలేదు…

అబ్బో అనుకున్నాను … కానీ వూరుకున్నాను…
మళ్ళీ మరుసటి రోజూ అదే జరిగింది…

ఏదో చిన్న మార్పు మొదలయ్యిందని అర్ధమయ్యింది… ఇది ఫలానా నెల రా (తెలుగు నెల) అని చెప్పడానికి అమ్మమ్మ లేదు… అమ్మ కూడా దగ్గరగా లేదు… బహుశా అమ్మ వాళ్ళ దగ్గర ఇంకా చలి మొదలవ్వలేదనుకుంటాను…

లేకపోతే ఈ పాటికే ఫొన్లో ఎన్నో జాగ్రత్తలు వచ్చేవి…

ఏది ఏమైనా ఈ సంవత్సరం, చలి కాలం వచ్చిందిరా అని ఎవరూ చెప్పక ముందు… నేనే కనుక్కున్నాను… ఇదేం గొప్ప విషయమా? అని మీరు ఎగతాళి చేసినా సరే!!!

చలికాలం వచ్చిందిరా అని నా ఫ్రెండ్ తో అంటే… నవ్వి, ఓ క్షణం అలోచించి… “వర్షాకాలం తర్వాత చలికాలమేగా, అందుకే వచ్చింది ” అన్నడు.కానీ నాకర్దమయ్యిందేమింటంటే, నేను చెప్పకపోయుంటే,  వాడీ విషయాన్ని అసలు గమనించేవాడు కాదు…బాగా చలి పెడితే జాకెట్టో, స్వెట్టరో తొదుక్కుంటాడు తప్పితే,. చ…లి…కా…లం   వ…చ్చిం…ద…ని అనుకోడు. అందుకే నా ఈ డిస్కవరీకి
నేను కొంచం ఎక్సైట్ అవుతున్నాను… మీకు నవ్వుగా వుందా??? నాకు బాధగా వుంది..

నెల వచ్చిందంటే…ఎన్ని హాలీడేస్ వున్నాయి??? లాంగ్ వీకెండ్స్ ఎన్ని అని తప్పితే…ఇది ఫలానా మాసం .. ఫలానా ఋతువు… ఈ సమయంలో వాతావరణం ఇలా వుంటుంది… ఈ.. ఈ  పండుగలు వస్తాయి.. ఇందుకోసం వాటిని జరుపుకుంటారు అన్న విషయాలేమీ మాకు తెలీవు!!!

తెలుసుకోవాలీ అన్న ఇంట్రెస్ట్ వుండదు… చెప్పేవారూ తక్కువ… ఒక వేళ ఎవరో ఒకరు తెలిసింది  చెప్పబోయినా… నవ్వులాట…  ఇవెందుకు అని… అందుకు నాకు బాధగా వుంది…

తెలుగులో ఋతువుల పేర్లూ… మాసాల పేర్లూ ఎంత బావున్నయో… ఇది కార్తీక మాసమట… ఆశ్వయుజ, కార్తీక మాసాలని కలిపి.. శరద్ ఋతువు అంటారట…

ఈ ఋతువులో ప్రక్రుతి కొత్త అందాల్ని సంతరించుకుంటుందట… స్పెషల్ గా చెప్పుకోవాల్సిందేమింటే…చంద్రుడు, .వెన్నెల్ని విరగకాస్తాడట.. వాతావరణం.. చిరు చలితో గిలిగింతలు పెడుతూ అద్బుతంగా వుంటుందట…

నవంబర్ 2 న కార్తీక పౌర్ణమి… ఆరు బయట పడుకోవటం అనేంత రిస్క్ చెయ్యకపోయినా (చాలా కారణాల వల్ల), కనీసం ఓ నాలుగు రాత్రుళ్ళయినా.. వెన్నెల్ని ఎంజాయ్ చెయ్యగలనా??? కార్తీక పౌర్ణమి ఒక పండుగ… అది ఎందుకు పండుగో… ఏ విధంగా జరుపుకుంటారో నాకు తెలీదు.

ఏమీ తెలీకపోయినా వెన్నెల్ని ఆస్వాదించవచ్చని తెలుసు… అదయినా చెయ్యగలుగుతానా… లేక మొబైల్ లో రిమైండర్ పెట్టుకోలేదు కాబట్టి మర్చిపోతానా :( ??? చూడాలి…

కె.వి.మహదేవన్…ఏ.ఆర్.రహమాన్…మైఖేల్ జాక్సన్… గురువారం, అక్టో 22 2009 

పాటలకి ట్యూన్ కట్టడంలో ఒక్కొక్కరిదీ ఒకో శైలి. అలాగే వినేవారిది కూడా. అలా నా శైలిలో  పాటలు వింటూ ఉంటే… పై ముగ్గురి పాటల్లోనూ ఒక విషయం అర్ధమయ్యింది…  అర్ధమయ్యిందీ అనడం సరికాదేమో!!! పై ముగ్గురి పాటల్లోనూ ఒక విషయాన్ని నేను ఊహించేసుకున్నాను. అది ఏంటంటే….

మొదట మన మామగారు (కె.వి.మహదేవన్ గారు):-

ఈయన పాటలు కొన్ని వింటుంటే…ఎంత గొప్పగా స్వరపరిచారా అనిపిస్తుంది… అసలు విషయం ఏంటంటే, ఈయన నాలుగయిదు  అద్బుతమైన ట్యూన్లని కలిపి ఒకే పాటలో పెడతారనుకుంటా…  పాట వింటుంటే మద్యలో ఒక చరణం దగ్గర అనిపిస్తుంది… అరే ఇక్కడ వచ్చిన ఈ బిట్ లోంచి కూడా మంచి పాటొకటి చెయ్యొచ్చే అని!! అలా అనుకొని వింటుంటే., అదే పాటలో మరో చరణం దగ్గర ఇంకో ట్యూన్… అరే దీన్లోంచీ మరో పాట చెయ్యొచ్చు కదా అనిపిస్తుంది. ఓ నాలుగు మల్లెలు, నాలుగు  సన్న జాజులు, నాలుగు  రోజాలు,, నాలుగు  మందారాలూ, నాలుగు  బంతులూ…మద్యలో ఓ తామరతో మాల కడితే ఎలా వుంటుందో???  (బావోదా??? మాల బావోపోతే పోనీండి) కానీ ఈయన పాట మాత్రం పంచ భక్ష్య పరమాన్నంలా వుంటుంది… చెవులూరేట్టు.!!!.

అసలు నా అనుమానం…ఒకో పాటకీ విడివిడిగా ట్యూనెవడు కడతాడులెద్దూ  అన్న బద్దకమో…లేక తెలుగు రాదు కాబట్టి..రాసిచ్చిన పాటలోని ప్రతీ చరణాన్నీ..ఒకో పాటనుకొని…స్వరపరిచేసి…ఆ తర్వాత  తప్పు తెలుసుకొని. ఓస్…. ఇదా సంగతి అనుకొని…మళ్ళీ నింపాదిగా  అన్నింటినీ అలా అలా కలిపెస్తారేమో…అద్బుతంగా.

ఏ.ఆర్. రహమాన్:-

ఒక పాట… అది ఏ సదర్భంలోదైనా,  ఎవరి సినిమాలోదైనా… ఒక పాట అంటే… ఇంత పనిచేయాలి అని నిశ్చయించుకొని చేస్తారనుకుంటా..ఎక్కువా కాదు…తక్కువా కాదు. అసలు ఆయన తన ఫ్యాక్టరీ లో (సారీ…స్టూడియోలో) ఒక పాట తీసుకొని, దాన్ని డెవెలప్ చేస్తూ ఇలా అనుకుంటారేమోనని… నా ఊహ…

“ఇక్కడ స్టార్టింగ్ లో టెంపో తగ్గింది… కొంచం పెంచు.. మధ్యలో సాగినట్టు లేదూ??, కొంచం టైట్ చెయ్యి…. లాస్ట్ లో ఏంటీ సడన్ గా టైట్ ఎండ్??? కొంచం సాగదియ్యి.  ఫీల్ ని ఇరికించు… ఇంకొంచం… ఆ!!! చాల్చాలు…”

99.999% ఆక్యురసీతో పనిచేసే యంత్రంలోంచి వచ్చినట్టుగా స్టాండర్డ్ గా వుంటాయి ఈయన పాటలు….

మైఖేల్ జాక్సన్:-

ఈయన పాటల్లో మాయలెక్కువ… వినిపించేవాడికి  వినేవాడు లోకువన్నట్టుగా!!!

ఒక పాట వింటూ మనం “హం”     చేస్తూ, ఈ బిట్ ఇక్కడ రిపీట్ చేస్తాడు అనుకొని మనం పాడేస్తే… అంతే అది అక్కడ రాదు. .వెంటనే అర్ధం కాదు… కానీ ఆలోచిస్తే ఆ ప్రయోగం బావుంటుంది.  (అదే మన కొన్ని పాటల్లో, ఒక రిథమిక్ బీట్ మంచిది కుదిరిందా, ఇక దాన్ని ఆ పాటలో బోర్ కొట్టే అన్నిసార్లు రిపీట్ చేస్తారు). కానీ ఆయన పాటల్లో ఆయన రిథమిక్ గా వున్న బీట్ మద్యలో వాడి వదిలేస్తాడు… తర్వాత హాయిగా పాట సాగిపోతుంటుంది. మళ్ళీ సడంగా ఆ బీట్ తో ఓ కుదుపు… ఇది నా పాటోచ్ అని… ఈయన పాటల్లొంచీ అక్కడక్కడా  ఇంకో పాటని తీయొచ్చు అనిపిస్తుంది. కానీ  అలా అనిపించిన చోటే వినిపించీ, వినిపించక ముందే ఆ బిట్ ని మాయం చేస్తాడు,. నీకు నా ఒక్క పాటే ఎక్కువన్నట్టు… ఎంతైనా తెలివైనోడు…

ఏదేమైనా….ముగ్గురూ పాటల మాంత్రికులే…

అసలు సంగీతం గురించి ఆవగించంత కూడా పరిజ్ఞానం లేదు కాబట్టి…నాకిష్టమొచ్చినట్టుగా…. నాకిష్టమైయిన వాళ్ళ గురించి ఊహించుకోగలను..

ఇందులో ఇది ఇలా కాదు / ఇది తప్పు అని ఎవరైనా అంటే…ఆ తప్పు సంగీతంలో అంత పరిజ్ఞానం వున్న తమది కానీ నాది కాదు అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ;)

నువ్వు లేవు… నీ పాట వుంది… శనివారం, ఆగ 29 2009 

నువ్వు లేవు… నీ పాట వుంది…
ఇంటి ముందు జూకా మల్లె తీగల్లో అల్లుకొని…
లాంతరు వెలుగు లో క్రమ్ముకొని…

నిశ్శబ్దంగా వుంది… నీరవంగా వుంది…

“తిలక్” గారు ఏ రహస్య ప్రియురాలి తలపులతో, ఈ కవిత వ్రాసుకున్నారో తెలీదు గానీ…

నాకు మాత్రం ఇప్పుడు మరొకరి జ్ఞాపకార్దం గుర్తొస్తుంది…

ఈరోజు మైఖేల్ జాక్సన్ పుట్టిన రోజు… ఆయన లేడు… కాని ఆయన పాట వుంది…

నిశ్శబ్దంగా కాదు… ఆయన జ్ఞాపకాన్ని గుర్తూ చేస్తూ వుంది…

Miss you… MJ గురువారం, జూలై 23 2009 

ఇంతకు ముందు మైకేల్ జాక్సన్ అంటే పెద్దగా తెలీదు. ఆయన సంగీతం గురించి అస్సలు తెలీదు. ఆయన మరణించాక కలిగిన సంచలనం చూసి ఆయన మీద ఇంట్రెస్ట్ పెరిగింది…

ఆ ఇంట్రెస్ట్ తోటే ఆయన గురించి తెలుసుకోవాలన్న కోరిక పెరిగింది…

తెలుసుకున్న కొద్దీ ఆశ్చర్యం పెరిగింది…

ఆ తర్వాత ఆయన పాటల కలెక్షన్ సంపాదించి వింటున్న కొద్దీ ఆనందం పెరిగింది.

ఇంత కాలం ఎంత మిస్సయ్యానే అన్న బాధా … ఇంకా ఏమేమి మిస్సవుతున్నానో అన్న భయం… రెండూ ఒకేసారి కలిగాయి…..

ఇన్ని కోట్ల మందికి ఆయన ఎందుకు ఆరాద్యుడయ్యాడో కొంచం అర్థమయ్యింది..
నిజంగా ఆయన “Most Successful Entertainer of All Time”"

ఎవరో అన్నారని కాదు, ఆయన పాటలు విన్నాక మనస్పూర్తిగా అనిపించిన భావం.

ఆయన పాటల్లో వున్న మానవత్వం, ప్రేమ… ఈ రెండు అంశాలనీ జీవితం లో కూడా చూపెట్టుకున్నాడు.. ఆయన మీద వున్న రూమర్లు, అభియోగాల గురించి వదిలేస్తే… చేసిన మంచి పనులు చాలానే వున్నాయనిపించింది..

Ofcourse…అన్నిటికన్నా గొప్ప పని, ఆయన సంగీతమే… దానికి ఆయనకి చాలా ధన్యవాదాలు..

నాకు బాగా నచ్చిన, నేను గత వారంగా విడవకుండా వింటున్న పాటల్లో కొన్ని…

1. Heal the world
2. Earth song
3. Speechless
4. Beat It.
5. You are not alone
6. Who is it

పై వాటిల్లో, Heal the world మొదటి సారి వినగానే… అప్పటివరకూ ఆయన పట్ల ఏ భావమూ లేక పోయినా, ఆయన మరణించాడన్న నిజం బాధపెట్టింది…

ఒక్కో మంచి పాట వింటున్నప్పుడల్లా ఆ బాధ పెరుగుతుంది…

కోరిక తీరనిదని తెలిసినా…

ఆయన కనపడితే ఈ ముక్క చెప్పాలి… No…No… i will SCREAM…

Dear MJ… We miss you… you will be remembered in each attempt that makes this world a better place…

జీనియస్ అంటే ఎవడు??? శనివారం, జూలై 4 2009 

ఏదో ఆలోచిస్తుంటే ఈ ప్రశ్న తట్టింది… సరే అని వికీపీడీయా లో వెతికితే…

ఏమని డిఫైన్ చేసాడో ఈ కింది లింక్ లో మీరూ చదవండి…

http://en.wikipedia.org/wiki/Genius

నాకేమర్ధమయ్యిందంటే,

“ఎవ్వడైతే, ఏదైనా ఒక రంగంలో ఒక స్తాయిని సౄష్టించి (చేరుకోవడం కాదు, అది అనుచరుల పని) దానికి తగ్గకుండా నిలకడగా (consistent) పెర్ఫార్మ్ చేస్తాడో వాడే వాడే జీనియస్” అని.

అంటే… ఒక వ్యక్తి దోశలు బాగా వెయ్యగలడనుకుంటే, ప్రతీ సారీ ఆ రుచి తగ్గకుండా, ఇంకా… ఇంకా… బాగా వెయ్యగలుగుతున్నాడంటే… వాడే దోశల జీనియస్ అన్నమాట…

అలా ప్రస్తుతం ఎవరున్నారని ఆలోచిస్తే ఈ కింది వారు (చాలా కొద్ది మంది మాత్రమే, ఊ… ఇంకా ఆలోచించాలి) వెంటనే స్ట్రైక్ అయ్యారు…

1. ఏ. ఆర్. రహమాన్: ఈయన పాటలు బాగా (వాయించగలరు ???). ఆ విషయం మనకి బాగా తెలుసు. మొదటి సినిమా “రోజా” నుంచీ అదే స్టాండర్డ్…ఇంకా మాట్లాడితే.. మనకందనంత ఎత్తులో కూడా ఏమైనా చెయ్యగలరనుకుంటా… అందుకే ఎక్కువ మాట్లడకుండా ఆయన్ని జీనియస్ లిస్ట్ లో పెడితే మంచి మంచి పాటలు వినొచ్చు… ;)

2. మణిరత్నం : ఈయన సినిమాలు బాగా తియ్యగలరు… ఒకసారి చూపిన ఫ్రేముని మళ్ళీ చూపకుండా… కొత్త కొత్తగా తీస్తూ…మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలరు…

3. సచిన్ టెండూల్కర్: ఈయన బాలుని బాగా బాదగలరు…ఎప్పుడో నేను చిన్నగా వున్నప్పుడు మొదలుపెట్టారట బాదటం… ఇంకా బాదుతూనే వున్నారు. మధ్య మధ్యలో… ఆగుతున్నా… ఇంత సుదీర్ఘంగా బాదతూనే వుండటం వీరి గొప్పతనం…

ఇంకా ఎవరు??? వేరే వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచించాలి…

తెలుగులో ఎవరు వున్నారు??? ఏమో???

ఏమంటున్నారు మీరు ???

హలో.. హలో.. వినపడట్లేదు…

వీకెండ్ వర్షం… శుక్రవారం , జూలై 3 2009 

బయట వర్షం పడుతుంది… ఎందుకో “ఆనాటి వాన చినుకులు” కథ గుర్తొస్తుంది.

ఇంటికి వెళ్ళగానే, చదవాలి…

ఊ… తర్వాత ఇంకా ఏం కావాలి… మొక్కజొన్న పొత్తులు… అద్రుస్టవశాత్తూ బెంగులూరులో అవి కొన్ని రోజుల ముందు నుంచే దొరుకుతున్నాయి.. ప్రాబ్లం ఇల్ల…(‘కన్నడ ‘ లో లేదు అని)

ఇంకా ఏం కావాలి… అన్నిటికన్నా ముఖ్యం రేపు వీకెండ్. అంటే పొద్దున్నే లేవాలన్న బెంగ లేదు.. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఈరోజు ఎంత లేటుగానైనా పడుకోవచ్చు…

ఇక చివరి కోరిక ‘రాత్రంతా వర్షం పడుతూనే వుండాలి…’ అది కుదరకపోతే కనీసం నేను నిద్రపోయేవరకైనా పడుతుంటే
చినుకుల చప్పుడు వింటూ నిద్రపోతాను…

రేపు పొద్దున్నే కొంచం బురదతతో నిండిన రోడ్లు, పచ్చగా వున్న చెట్లు… చాలు … మళ్ళీ రేపు సాయంత్రం ఇలాగే ఒక వర్షం… ఆ తర్వత ఎళ్ళుండి ఒకటి … ఆ తర్వాతి రోజు… ఆ తర్వాత… దీనికి ఎండ్ బేడ ;)

హ్రుదయపు మానిటర్… ;) శుక్రవారం , జూన్ 19 2009 

నీ గురించి విపరీతంగా ఆలోచించి,
నా మెదడు హ్యాంగయ్యింది

నా హ్రుదయపు మానిటర్ మీద,
నీ రూపు నిలిచిపోయింది… :)

హ..హ..హా… ;)

తరువాతి కాగితం »

Follow

Get every new post delivered to your Inbox.