హకూన… మటా…డ ;) శనివారం, ఆగ 13 2011 

రాజకీయాలూ, సినీమాలూ, క్రికెట్టూ, ఆటలూ, కథలూ, కాకరకాకాయలూ బోరు కొట్టేశాయి…
ఉద్యమాలు ఎక్కువయ్యి… రాజకీయాలు బోరు…
ఐ.పీ.ఎల్, వరల్డు కప్పులు… క్రికెట్టు బోరు…

సామెత చెప్పినట్టు.. “కక్క తింటే గారె చేదని”…

హిట్లు లేని సినీమాలు బోరు…
పాటలంటారా!!! ఈ రోజు నచ్చింది రేపటికి బోరు…

సాంప్రదాయ న్రుత్యాలూ, నాటకాలూ అంటారేమో, అబ్బే మనకస్సలు కుదరదు…
పోనీ ప్రక్రుతీ, భావుకతా అంటారేమో…
భలేవారే… అసలు అంత టైమెక్కడేడ్చింది…

పైగా అ రెండింటినీ తెలుగులో ఆస్వాదించాలి… ఇంగ్లీషు స్వంతది కాదాయే…
పోనీ తెలుగులో అస్వాదిద్దామా అంటే… అంత తెలుగు రాదాయె…

సర్లెండి, ఇవన్నీ ఆలోచించకూడదు…
మనసు పాడవుద్ది…
మీకు మరీ అంత మునిగిపొయే పనులేం లేవంటే…
సరదాగా అలా త్రేతా యుగం వరకూ వెళ్ళొద్దాం వస్తారా???
పనంటే…మరేం లేదు…

ఈ మధ్య మా సంఘం… అదే…
క.తి.క.తా.క.బ సంఘం అండీ…
అబ్బా… అంటే… కలలు తిని, కలలు తాగి,కలల్లో బతికే సంఘం…
దాని ఏకైక సభ్యుడిగా … కొన్ని పనులు నెత్తి మీద వేసుకున్నాను…
అందులో మొదటిది…

ఉటోపియా ఎక్కడుందో కనుక్కోవడం…
లాస్ట్ విసిట్ లో అన్ని కాలాలూ, ప్రదేశాలూ గాలించినా అది కపడలేదు…
అందుకని.. నేనే దానికి రూపకల్పన చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను…

అదిగో..అప్పుడే చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తొచ్చాయి…
నేను డిజైన్ చేస్తున్న ఉటోపియా కి, రామరాజ్యం బ్లూ ప్రింటు ఏమన్నా పనికొస్తుందేమో అనుకొని
రామరాజ్యం చూద్దామని మొదటిసారి త్రేతాయుగానికి వెళ్ళాను…
కానీ అప్పుడు రాముడు ఇంకా రాజవ్వలేదు…
అడవుల్లో వనవాసం చేస్తున్నాడు… అందుకే వెనక్కి వచ్చి…

నా యుఫోరియాలో… ఊపులో… ఉటోపియా ని ఎడా పెడా డిజైన్ చేస్తూ బాగా బిజీగా తయారయ్యాను…

ఎందుకో తెలీదు…
ఒక రోజు సడన్ గా బోరు కొట్టింది.. ఏం చేస్తున్నా, ఏం చుస్తూన్నా బోరే…

అందుకే మళ్ళీ ఇలా యాత్ర మొదలుపెట్టాను…
అమ్మయ్య…ఇప్పటికైనా నీకు మొత్తం అర్థమయ్యిందనుకుంటా…

అదిగో… మాట్లాడుతూనే రామరాజ్యానికి వచ్చేశామే…

ఆయనేనా రాముడు… ఏమిటి ఒల్లంతా నీలంగా వుంది… మరీ మిథిలిన్ బ్లూ లో మునిగి తేలలేదు కదా…
మనకెందుకు లే..

“కొన్నీచ్చివా రామా సాన్ “?

ఖంగారు పడకు… జపనీస్ లో అడిగాను…
దేవుడు కదా అన్ని భాషలూ తెలిసుంటాయిలే…

అదేంటి మొహం మాత్రం నీలం నుంచి తెల్లగా మారింది…
ఆ!!! తెల్ల మొహం…

హాష్చర్యం… ఈయనకు జపనీస్ తెలీదా…
పోనీ తెలుగు??? అదీ తెలిసినట్టు లేదు…

అదేంటీ??? ఈయన దేవుడు కాడా ఏంటి?

అసలే మనది సెకండ్ లాంగ్వ్యేజ్ సంస్క్రుతం…

ఈ భాషతో, యుటోపియా ని కాదు కదా… కనీసం ఆంద్రప్రదేశ్ ని డిజైన్ చేసేంత ఇన్ ఫర్మేషన్ కూడా రాదు…
ఈయన్ని సంస్క్రుతం నేర్చుకొని వచ్చి కలుద్దాం…

పద ఇప్పుడు…

వచ్చిన పని ఎలాగూ కాలేదు… ఇక ప్లాన్ లేకుండా పనులు చేసుకోవడమే మంచిది…

సర్లే… త్రేతాయుగం వరకూ వచ్చాం కదా, కొంచం దూరం అలా ద్వాపరయుగం వరకూ వెళ్ళి, క్రిష్ణుని పాలన కూడా చూసి వద్దాం…

అరే… క్రిష్ణుడు ఇంకా పెద్దవాడు కాలేదు…
అదేంటీ?? ఏం చేస్తున్నాడు???
దొంగతనమా? నిజమే!!! స్నేహితులతో కలిసి… చేస్తున్నాడు…
మందలిద్దామా అనిపించింది… కానీ పాపం మన కవులు గుర్తొచ్చారు… ఇప్పుడు నేను క్రిష్ణున్న్ని మందలిస్తే… ఆయన దొంగతనం మానేశాడనుకోండి… మన కవులూ, ప్రస్తుతం టీ.వీ సీరియలు వాళ్ళూ ఏమవుతారు??? అసలే ప్రస్తుతం తెలుగు లో కూడా డబ్బింగ్ సీరియల్లతో టీ.ఆర్.పీ లు పెంచుకుంటున్నారు… అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని… మరీ ఇంత దూరం వచ్చి మాట్లాడకపోతే బావోదని, పైగా ఇందాక రాముడి తో వచ్చిన భాషాభేదం గుర్తుంది కాబట్టి… శుద్దమైన హిందీ లో బావున్నరా??? అని అడిగాను…
కానీ అర్థం కాని భాషలో ఆయన ఏదో అన్నాడు… బహుశా అవధి నో, మరోటో…
నాకైతే అర్థం కాలేదు…

కానీ, ఒక్కటి మాత్రం బాగా అర్థమయ్యింది… ఇంకొంచం సేపు అక్కడే వుంటే మాత్రం… నలుగుర్నీ పిలిచి..అక్కడ జరిగిన దొంగతనం నా మీదకే నెట్టేట్టున్నాడు… మనకెందుకొచ్చింది… చెప్పండి…

కానీ తర్వాత అలోచిస్తే అర్థమయ్యింది ఏమిటంటే… నేను వాళ్ళని కలిసినప్పటికి వాళ్ళింకా దేవుళ్ళు కాలేదు… తర్వాత మనవాళ్ళెప్పుడో తీరిగ్గా వాళ్ళని దేవుళ్ళని చేసుంటారు…పాపం…

ఇక భారతదేశం మొహం మొత్తి…
చైనా పెద్ద గోడెక్కి (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా)చూసి… ఆ అందానికి తరించి… ‘పియోలియాంగ్’ అని అప్రయత్నంగా అనేసి…
అక్కణ్ణించి… బాబిలోనియన్ వెళ్ళాడే తోటలోని మొక్కలోంచి ఒక పువ్వుని త్రుంచుకొని…
అక్కడ ఎగిరి… ఈజిప్టు పిరమిడ్ల మీద వాలి… మమ్మీగా మారుతున్న ఒకన్ని చూసి (శవాన్ని), ‘అహ్ల్న్ బీక్ ఫె మస్ర్” అని ఆశీర్వదించి…
రోము తగలబడుతుంటే… ఒక చెంచాడు నీళ్ళు చల్లి.. ఫిడేలు వాయిస్తున్న నీరో సంగీతం విని ముగ్దుడినై… ‘ఇడియొట ‘ అని ముద్దుగా తిట్టి…
మాచుపిచ్చు లో ప్రక్రుతి అందాలని ఆస్వాదించి…
కెన్యాలోని సుందరాంగికి ‘నాకు పెండ ‘ అని చెప్పి…
కోపంగా పక్కనుంచొచ్చిన వాళ్ళాయనని చూసి దడుసుకొని…
కిందపడితే…
ఇదిగో… నా మంచం కింద నుంచి లేచాను…

మా సంఘం మీటింగ్ ముగిసింది…
మరో రోజు మొదలయ్యింది… అయినా..

హ..కూన… మటా…డ…

ఎందుకంటే… ప్రతీ ఉదయం తర్వాత ఒక రాత్రి వస్తుంది…

ప్రస్తుతానికి…

హాస్త ల విస్తా…బేబీ ;)

ఏం కావాలి? ఆదివారం, ఆగ 7 2011 

…అని అడిగితే, ఏం వద్దు ??? అని మీరు వెటకారంగా అడుగుతారని తెలుసు… కానీ ఏం చేస్తాం… కొన్ని సార్లు తప్పకుండా ఆ ప్రశ్న వేసుకోవాల్సొస్తుంది…
ముఖ్యంగా మనతో పాటే ఇన్నాళ్ళూ పనిచేసిన వ్యక్తి అకస్మాత్తుగా ఏ స్వీడనో లేక సింగపూరో లేక స్విట్జర్లాండో లేక మరో లాండో వెళ్ళిపోతున్నాడని తెలిస్తే… మనకంటే సంపాదన కొన్ని రెట్లు అమాంతంగా పెరిగిందని… మన దగ్గర నెల చివర్లో ఇక చేబదుల్లు తీసుకోడని… కనీసం, మరీ ముఖ్యంగా అప్పుడప్పుడు మనకి చేబదులు ఇవ్వడని తెలిస్తే… కొంచం బాధపడి వూరుకోవచ్చు…
కానీ ఇదే విషయం మన ఇంట్లోనే తెలిస్తే…
వెళ్ళేవాడు ఎందుకెళ్ళాడో తెలుసుకోకుండానే నా చెవుల్లో జోరీగలు మోగిస్తే…

కనీసం అప్పటికోసమైనా, ఆ క్షణానికైనా నాకేం కావాలి అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి… తప్పదు…
అలా నన్ను నేను తీవ్రంగా ప్రశ్నించుకుంటే, నాకు కావలిసిన కొన్ని అవసరాలు నాకు అర్థమయ్యాయి… అవి ఏమిటనిన… 

1. ఆరు జీన్సులు (బ్రాండెడ్ వి బ్రాండ్ కోసం కాకపోయినా మన్నిక, సుఖం కోసం)… ఖరీదు – 7500/-
2. 10 టీ-షర్టులు… ( -డు- (అనిన యధావిదిగా అని అర్ధం చేసుకోగలరు))- షుమారు 8000/-
3. 5 ఫార్మల్ ప్యంటులు – షుమారు 8000 /-
4. 10 ఫార్మల్ షర్టులు – షుమారు 10000 /-
5. రెండు జతల క్యజువల్ బూటులు… షుమారు 7000/-
6. ఒక జత ఫార్మల్ బూటులు… షుమారు 2000/-
7. ఒక జత చెప్పులు – షుమారు 1200 /-
8. ఒక జత స్లిప్పర్లు – షుమారు 300/-
9. ఒక లాప్ టాపు – షుమారు 40000/-
10. ఇంతెర్నెట్ కనెక్షను (నెట్ అపరిమితంగా అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు తమకు, కానీ వచ్చిన చిక్కంతా దాని పనితీరుతోనే… కాబట్టి… సదా సర్వీసు ప్రొవైడరు వాగ్దానం చేసినంత స్పీడు… అంతకంటే ఎక్కువ కోరుకోవట్లేదు)
11. ఒక ఐ ఫోను. షుమారు – 30000
12. ఒక ఐ ప్యాడు లేదా ఒక ఎం.పీ.త్రీ ప్లేయరు… షుమారు 8000 /-
13. ఒక పేద్ద టీవీ… షుమారు…. 22000/-
14. దానికి కేబులూ… షుమారు 200 /- (నెలకి)
15. ఒక 4.1 / 5.1 చానల్ మ్యూజిక్ సిస్టం… (5000/-)
16. మూడు లేదా నాలుగు… లేకపొతే సరిపడినన్ని పుస్తకాల షెల్ఫులు…
17. వాటినిండా నేను కొనుక్కునే పుస్తకాలు – ధర ఐచ్చికం
18. ఇంకో షెల్ఫు నిండా నేను చూడాల్సిన సినీమాలు, వినాల్సిన పాటలు…ధర ఐచ్చికం

మొత్తం కలిపి 1,49,000/-… సమీప సరి సంఖ్య 1,50,000 /-
అంతే… ఇవి చాలు నిజంగా బోరు లేకుండా జీవితాన్ని అనుభవించాడానికి…

వీటిలో చాలా వరకు లేదా దాదాపుగా అన్నీ సమకూర్చుకుని ఇక చాలు కదా అంటే వినరే… ఇంకా ఏదో కావాలి…

ఫైనాన్షియల్ సెక్యురిటీ కావాలి అని వారి వాదన…

అదీ నిజమేనేమో అనిపించినా , నాకు మాత్రం మరేదో అసంత్రుప్తి..

ఏమై వుంటుందా అని ఆలోచిస్తే, అన్నిటికంటే ఎక్కువగా నాకు దొరకట్లేనిది “సమయం”…

అన్నీ వున్నా అల్లుడి నోట్లో … అన్నట్టు… అన్నీ వున్నా చదవాలనిపించినప్పుడు చదవలేం… వినాలనిపించినప్పుడు వినలేం… నచ్చిన పనికి సమయం కేటాయించలేం… ఆంగ్లములో అనాలంటే ….జాబ్ సక్స్… ఇంకా నయం పశ్చిమాన పుట్టలేదు… అక్కడ ఈ మాటంటే కూడా ఉద్యోగం పీకేస్తారట…


అసలు సంగతేంటంటే… ఇక్కడే వుండి జీవితాన్ని అనుభవించాలీ, విదేశాలకి కేవలం వినోదానికో, విహారానికో వెళ్ళాలి కానీ పొట్టకోసం వెళ్ళను అని నేనంటే… కొంత మంది నవ్వి… నావి చేతకాని మాటలని, మరికొంత మంది కలలకి, కబుర్లకి తక్కువేం లేదనీ అన్నారు…

కాబట్టి నేను పై లెఖ్ఖలు వేసి తేల్చినదేమిటంటే… నేను ఆనందంగా బ్రతకాలంటే కావలిసింది మరీ అంత పెద్ద మొత్తమేమీ కాదు… అలా అని మరీ చిన్న మొత్తమేమీ కాదు…
కాకపోతే… నాకు కావల్సిన టైం ని నేను ఉద్యోగం చేస్తూనే సంపాదిస్తే నేనూ నా చుట్టూ వున్నవాళ్ళూ సంతోషంగా వుంటారు…
కానీ నా స్టయిల్లో బతకాలంటే…ఈ వుద్యోగం మానేసినా…ఇప్పుడొచ్చినంత సంపాదిస్తే…ఎవ్వరికీ ఏ గొడవా వుండదు…
కాబట్టి అలా అలోచిస్తాను అంటే…
దానికీ వెటకారాలు… ఎప్పుడెళ్తున్నావు కన్నం వెయ్యడానికి అని…
ఆశ పడితే..అత్యాశ అంటారు… సంత్రుప్తి పడితే…అల్ప సంతోషీ అంటారు…
ఎవ్వరు ఏమన్నా, ఆర్ జీ వీ స్టైయిల్లో… ‘నా చావు నన్ను చావనివ్వండి’…అంటే సరి…

పీ.ఎస్. : విషయం పెద్దది…కాబట్టి నేను చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పకపోవటం జరిగిందని నా వుద్దేశ్యం… కాబట్టి మరింత లోతైన సమచారం కోసం తర్వాత చూద్దాం…
అప్పటికీ నాలో ఈ వేడి వుంటే ;)

Follow

Get every new post delivered to your Inbox.