“A thing of beauty is joy forever…” అట… ఈ రోజు దీనికి సంబందించిన వివరాలు చూసాను.
మొత్తం “Endymion” పద్యం వెతక్కపోయినా, Wiki లో దొరికిన చిన్న పద్య పాదం చదివాను… అర్ధమయ్యీ… అర్ధం కాక, ఓ మోస్తరుగా భావం అర్ధమయ్యింది…
John Keats గారి పద్యం ‘Bright star’ అంత బాగా అర్ధం అవ్వకపోయినా… పై వాక్యం ఒక్కటి చాలదూ…నాకు
నా చిన్నప్పుడెప్పుడో, పై వాక్యం విన్నాను… తర్వాత మళ్ళీ ఎక్కడో చదివినప్పుడో, గుర్తొచ్చినప్పుడో… దీని గురించి ఆలోచిస్తుంటే, ఏదో ఒక చిలిపి ఊహ తలపుల్లోకి వచ్చేది. అలాంటి కొన్ని తలపులే ఇవ్వి…
కవి ఏ ఉద్దేష్యంతో కవిత వ్రాశాడో శోదించటం నాకు తెలీదు. దాన్ని నాకు నచ్చిన విధంగా అన్వ్యయించుకొని ఆనందిచటమే తేలిక, సుఖం… అందం కూడానూ
అందం… దీన్ని నేను చాలా రోజులు ఒక ‘Relative term’ అనుకునేవాన్ని
కానీ ప్రస్తుత అభిప్రాయం ప్రకారం అది పూర్తిగా నిజం కాదు. అంటే అందం అనేది 20 % ‘Relative’ గా వుండొచ్చు…కానీ 80 % ‘Absolute’.
అంటే అందం అనేది ‘objective’, ‘measurable’, ‘quantifiable’, ‘definable’ etc…etc…
ఎలా ఇది ‘Absolute’ అని చర్చించే ముందు…అసలు ‘అందం’ అవసరమైనదేంటి అనేది చూద్దాం,
1. పరిసరాలు
2. ప్రక్రుతి
3. మనుష్యులు, జంతువులూ… etc…
1. పరిసరాలు:
అంటే మన ఇళ్ళు, మన ఆఫీసు, కాలేజీ, etc…etc… స్థూలంగా అనుకోవాలంటే మనం తరచుగా తిరుగాడే స్థలాలు… ఇవ్వి అందంగా వున్నాయి అని ఎలా చెప్పటం?
వీటి అందాన్నిఅసలు మనం అదుపులో పెట్టొచ్చా అంటే ‘అవును’ అనే అనాలి…
‘పొందికగా, కేటాయించబడిన స్థానంలో, శుబ్రంగా, కుదురుగా, వస్తువులు అమరినప్పుడు, ఆ పరిసరాలలో అందం ద్యోతకమవుతుందీ…’ ఇది నా అభిప్రాయం.
పొందికగా ఎలా అమర్చాలి అనేది మళ్ళీ వ్యక్తిగతం. (Relative అభిప్రాయం). కానీ ఎలా అమర్చినా, పొందిక, శుబ్రత వుంటే కళ్ళకి ఆహ్లాదం…అదే అందం
2. ప్రక్రుతి:
ప్రక్రుతి అందమైయినదే కానీ ప్రక్రుతిలోని అన్నీ అందమైయినవి కావు… ప్రక్రుతి లోని విలయాలు అందమైనవి కావు. అందులోని కొన్ని దశలు అందమైనవి కావు. కానీ సహజంగానే, ప్రక్రుతిలో కొన్ని అమరికలున్నాయి… ప్రక్రుతిలోని అమరికల గురించి సైన్సుని కూడా తీసుకోవచ్చుగానీ, నేను రవీంద్రున్ని తీసుకోవడానికి ఇష్టపడతాను. ఆయన ‘గీతాంజలి’ లో ఒక చోట అంటారు… ‘సారం లేని సరళ రేఖల్ని త్యజించి, అద్బుతమైన వంపులలో……’ అని. అంటే ప్రక్రుతి లోని కొన్ని కుదురైన వంపులు మనకి అందం… అంతే…
ప్రక్రుతి అందమైయింది… దాని అందాన్ని మనం పెంచలేం… పెంచాలని ప్రయత్నిస్తే అది విక్రుతవుతుంది. ఆందుకని దాన్నలా ఆస్వాదించటమే ఆనందం…
3. ఇక పోతే మనుష్యులు… (సైంటిఫిక్ గా మనిషీ ఒక జంతువే అయినా, ప్రస్తుతానికి మనుష్యుల గురించే అనుకుందాం… వేరే జంతువులు మనకొద్దు
మనుష్యుల అందం…అబ్బో, ఇదీ (దీని కోసం) చెయ్యని పని లేదు. దీని మీద ఇప్పుడున్నంత పిచ్చి మరెప్పుడూ లేదనుకుంటాను… ముఖ్యంగా అందం ‘Relative’ అనుకోవలసి వచ్చేది మనుష్యుల తోనే… కానీ, మనుష్యుల్లోనూ అందాన్ని కొలిచే పద్దతుందని చాల రోజుల క్రితం చదివాను… దాని ప్రకారం, మొహంలోని వివిధ భాగాల కొలతల ‘Ratio’ తీసుకుంటే అది ‘సున్నా కి’ దగ్గరగా రావాలట… అలా వస్తే అది అందమైన మొహం అట. అలా మన నేతల మొహాల్ని కొలిస్తే… రాజీవ్ గాంధి గారిది సున్నాకి దగ్గరగా వచ్చిందట…(మరి మన నేతల మనసుల అందాన్ని కొలవగలిగేది కనిపెట్టారో లేదో
) సో, దీన్ని బట్టి తేలిందేమిటంటే మనుష్యుల అందాన్నీ మనం కొలవచ్చు. ‘Physical beauty is not volition’ అని అయాన్ ర్యాండ్ కూడా ఒక చోట అన్నారు.
వీటన్నింటినీ బట్టి చూస్తే, శుబ్రంగా, కుదురుగా, పొందికగా, మన పరిసరాల్నీ, మనల్నీ వుంచుకుంటే మనం అందమయినవాళ్ళం ![]()
ఎక్కడికక్కడ విసిరేసిన సామాన్లూ, పేరుకు పోయిన దుమ్ము, కుదురులేని అమరిక, ఇవి పరిసరాల్ని వికారం చేస్తాయి…
అందం కోసం వేల రూపాయల కార్పెట్లు అవసరం లేదు, పేడతో అలికిన నేలయినా, శుబ్రంగా వుంటే బావుంటుంది…ఖరీదయిన ఎమల్షన్ పెయింట్లు అవసరం లేదు, మరకలు లేని సున్నపు గోడే అందం…
వేల రూపాయల డ్రెస్సులూ, కాస్మెటిక్సూ అవసరం లేదు… కొవ్వు చేరని, వాసన రాని ఒళ్ళు చాలు…
చివరగా ‘An ounce of courage is enough to remove a ton of distress’ అట…
నా వరకూ ‘పావు ఔన్సు శ్రద్ద, పావు ఔన్సు ఓపిక, పావు ఔన్సు ఆలోచన, మిగతా ఔన్సు శ్రమ చాలు, ఒక టన్ను అందాన్ని స్రుష్టించడానికి”
ఈ చిన్ని సూత్రం (ముఖ్యంగా పరిసరాల శుబ్రత లో) నాకు ప్రాక్టికల్ గా ప్రవర్తనలో చూపెట్టి… నాకూ కొంచం శుబ్రం నేర్పిన నా స్నేహితుడు… ‘కిచ్చూ’ కి నా….
అబ్బే వాడికివన్నీ అవసరం లేదు లేండి….
well said.. so nice of this.