స్పెల్లింగ్ మిస్టేక్ కాదు… పైన టైటిల్ కరెక్టే…

ఒక్కోసారి కొన్ని ప్రశ్నలకి గమ్మత్తైన జవాబులు వుంటుంటాయి…

అలా వుండొచ్చు… ఎవ్వరూ కాదనరు…

 కానీ నాకు అప్పుడప్పుడూ… గమ్మత్తయిన ప్రశ్నలు బుర్రలోకి వస్తుంటాయి…

వాటికి జవాబులు నేను వెతికితే దొరకవు… ఎవరినీ అడగడానికి వీలుపడదు… ఎవరు చెప్తారు… అప్పటికీ కొంత మంది విషయ ప్రావీణ్యులని (Subject experts)అడిగాను… కానీ లాభం లేకపోయింది…

ఆ ప్రశ్నలెట్టివనిన….

1. F TVవాడి ప్రధానోద్దేశ్యం ఏమిటి? అందులో కనిపించే మోడల్స్ కి ఆదాయం ఏంటి??? వాళ్ళు చూపెట్టే ఫ్యాషన్స్ ని బయట జనం అసలు పాటిస్తారా??? ఎంత విదేశాల్లోనైనా సరే??? వాటిని ప్రమోట్ చేసే కంపెనీల ప్రధాన ఉత్పత్తులే ప్రదర్శిస్తారా? లేక అది కేవలం పబ్లిసిటి కోసమేనా??? అసలు ఈ ఫ్యాషన్ షో ల బిజినెస్ మోడల్ ఏంటి???  మొత్తం ఆ సమాజం ఎలా పని చేస్తుంది??? వాటి ఆదాయ వ్యయాలు ఎలా వుంటాయి? వాటి Modus operandi ఏంటి? ;)

ఇంకోటి… పై దానితో అస్సలు ఆవగించంత కూడా సంబందం లేనిది…

 2. చాలా కాన్ ఫరెన్స్ హాళ్ళలో… ఇంకా మీటింగ్ రూం లలోని ఫాల్స్ సీలింగ్ ల లో… కనపడీ కనపడనట్టు… చూపెట్టీ చూపెట్టనట్టు…లైట్లు అమరుస్తారు… ఎందుకో అర్థం కాదు… ఏదో డిస్కషన్ కోసమో… మీటింగ్ కోసమో అందులోకి వెళ్ళినప్పుడు… అన్ని లైట్లు వేసుకొని…మళ్ళీ బ్లైండ్స్ తెరుచుకొని…పని చెయ్యాలి… కేవలం ప్రొజెక్టర్ లో ఏదైనా సినిమా (*.పిపిటీ) వేసినప్పుడు మాత్రమే… ఈ లైట్లు పనికి వస్తాయి… లేక పోతే వేస్ట్… ఒక్క చోట కాదు… దాదాపు ప్రతీ చోటా ఇంచు మించు అవే డిజైన్లు… వాటి ఉపయోగం ఏంటో అర్థం కాదు… అవే లైట్లని బయటకి పెడితే ఎంత వెలుగు… అవసరం లేక పోతే…ఒకటి రెండు ఆఫ్ చేసుకోవచ్చు… లేదా తక్కువ కెపాసిటీ వున్నవి వాడుకోవచ్చు… కానీ ఎక్కడా సింపుల్ గా… పనికి కరెక్ట్ గా పనికి వచ్చే మీటింగ్ రూం లని చూళ్ళేదు… అంతా అనవసరమైన హడావిడే…

ఇలా అర్థం పర్థం లేని టాపిక్ ల మీద… ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి సందేహాలు వస్తుంటాయి :(  

ఇప్పుడే వచ్చిన అవుడియా ప్రకారం…అలా వచ్చిన పిచ్చి సందేహాల్ను ఇప్పటినుంచీ ఇందులో పెడతాను… ఏ??? ఎందుకు నేనొక్కణ్ణే వీటిని భరించాలి? ;)