మొన్నీ మధ్య మాటల సందర్భంలో ఎవరో అన్నారు. “ఆ…రావణ్ లో ఏముందీ? మట్టీ, బురదా తప్పా” అని… అది విన్న తర్వాతే నాకర్ధమయ్యింది… నిజంగా నాకా సినీమా ఎందుకు నచ్చిందో:) నిజంగా ఆ సినీమా చుస్స్తుంటే నాకు మట్టి వాసనొచ్చింది…

మన జీవితాలు ఎలా తయరోయ్యాయో….

వచ్చే మట్టి వాసనని, తార్రొడ్లూ, సిమెంటు రోడ్లు వేసి మూసేశాం.
బురద లేకుండా మట్టిని తారుతో కప్పేశాం,
నీరు నిలవకుండా పైపులతో డ్రైనేశాం,
కొంచం కూడా స్థలం లేకుండా
ఇళ్ళతో నింపేశాం,
చెరువులని పూడ్చేశాం,
పార్కులని ఆక్రమించేశాం…
మంచి నీళ్ళని బాటిళ్ళలో దాచేశాం…

ఇప్పుడు,

పచ్చటి పొలాన్ని, పరిశుబ్రమైన సెలయేటిని, చిక్కటి చెట్లనీ, మట్టినీ, బురదనీ చూడ్డానికి, 60 రూ పెట్టి పొగవదులుతూ కార్లో వెళ్ళి, 200 పెట్టి టిక్కెట్టు కొని సినీమాకి వెళ్ళీ, మట్టినీ, బురదనీ, నీటిని తనీతీర చూసి, 150 రూ పెట్టి నల్ల రంగు నీళ్ళు కొని తాగి, ఇంటికొచ్చి,కిటికీలు తలుపులూ గట్టిగ వేసి, ఏసీ వేసుకొని పడుకొని నిద్దరోతాం…

మనకి వీటితో నాగరికత పెరిగిందట…
ప్రక్రుతి అడవితో కలిసి వెళ్ళిపోతుందట…